Pawan Kalyan Comments on Heros : పవర్ స్టార్ , ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలలో పాత్రల మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన బెంగళూరు వెళ్లారు. అధికారిక పర్యటనలో భాగంగా అక్కడ అధికారులతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. 40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, అప్పుడు హీరోలంతా అడవులను కాపాడే పాత్రలు పోషిస్తే ఇప్పుడు మాత్రం కుర్ర హీరోలు మాఫియా, స్మగ్లింగ్ పాత్రలు పోషిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరిస్థితి చాలా మారిందని ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే పాత్రలు చేస్తే ఇప్పుడు హీరోలు మాత్రం అడవులను నాశనం చేసి చెట్లను నరికి వాటిని స్మగ్లింగ్ చేసే వారిగా నటిస్తున్నారని ఆయన అన్నారు.
Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గందదగుడి అనే సినిమా తనకు చాలా ఇష్టమని అడవిని రక్షించడమే ఆ సినిమా కాన్సెప్ట్ అని చెప్పుకొచ్చారు. డిఎఫ్ఓగా రాజ్ కుమార్ అడవులను కాపాడే తీరు తనకు అప్పట్లో చాలా బాగా నచ్చిందని పవన్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరారు. ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ ఈ మేరకు కామెంట్స్ చేశారు.