Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు కింగ్ నాగర్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రెస్ మీట్ లో కింగ్ నాగార్జున మాట్లాడుతూ: “అందరికీ నమస్కారం. అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఇది 50వ సంవత్సరం. నాన్న ప్రారంభించిన ఈ సంస్థలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించాం. జాతీయ అవార్డులు అందుకున్న సినిమాలను కూడా రూపొందించాం. ఈ 50వ సంవత్సరం సందర్భంగా మా టీమ్ అంతా కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో భాగంగా డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరించాం. నాన్న సినిమాలు చేసిన రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదో, ఆ పద్ధతిని మళ్లీ తీసుకురావడంతో పాటు దాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇటీవలే డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించాం. అది చాలా విజయవంతంగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో మంచి సినిమాలు చేశాం. ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని, మరింతమంది కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే ఈ సినిమాలను ప్రారంభించాం. మొన్ననే ‘లెనిన్’ను రిలీజ్ చేశాం. ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’ సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఆ తర్వాత మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు నా ‘కింగ్ 100’ కూడా రాబోతోంది.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ చాలా బిజీగా ఉంటుంది. ఇకపై మరింత జోరుగా సినిమాలు చేయబోతున్నాం. ‘పళ్ళ బురుసు’ సినిమా గురించి చెప్పాలంటే.. తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. నా తల్లిదండ్రులను నేను చూసుకున్నాను. వాళ్లు నన్ను చిన్నప్పుడు చూసుకున్నారు. మనకు చిన్నప్పుడు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటాం. మనం పెద్దయ్యాక వాళ్ల బాధ్యతను తీసుకోవాలి. ఎవరైనా సరే తల్లిదండ్రులకు సేవ చేయాలి. అమల తన పేరెంట్స్ ని అద్భుతంగా చూసుకుంటుంది. తనతో ఎప్పుడూ చెబుతుంటాను.. తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరని. తల్లిదండ్రులను చూసుకోవడం చాలా ముఖ్యం. ఉదయ్ నాకు కథ చెప్పినప్పుడు ఇదే విషయం నాకు గుర్తుకు వచ్చింది. ఈ కథను అతను చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు. సుధాకర్ రెడ్డి, శంభూతాత పాత్రలో అద్భుతంగా చేశారు. మురళీధర్ గౌడ్ గారి నటన కూడా చాలా బాగుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చక్కని నటన కనబరిచారు. చాలా మంచి టీమ్‌వర్క్‌తో చేసిన సినిమా ఇది. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. పవన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ‘లవ్ స్టోరీ’ మ్యూజిక్‌ను నేను ఇప్పటికీ వింటూ ఉంటాను. ఈ సినిమాకు కూడా ఆయన చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. నేను సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. సినిమా చూస్తూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమించి తీసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. కొత్త కథతో ఎవరైనా వస్తే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి సిద్ధంగా ఉంది. మా టీమ్‌కు కథ నచ్చితే, నేను తప్పకుండా కథ వింటాను. అన్నపూర్ణ కాలేజీకి గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు వచ్చినప్పుడు తెలంగాణ కల్చర్‌పై ఎందుకు ఒక సినిమా తీయకూడదని అడిగారు. పళ్ళ బురుసు నేపధ్యానికి సంబంధించిన చక్కని కథ. ఆగస్టు 14 మా అమ్మగారి పుట్టినరోజు. అమ్మానాన్నల ఆశీస్సులు ఈ సినిమాపై ఉంటాయని నాకు నమ్మకం ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..