హీరోయిన్స్‌గా కెరీర్ మహా అయితే ఐదేళ్లు… లేదా పదేళ్లు.. కానీ 23 ఏళ్లుగా సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది నయనతార. ఇన్నాళ్ల కెరీర్‌లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీ రామ రాజ్యం తర్వాత యాక్టింగ్‌కు ఫుల్ స్టాఫ్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేశ్ శివన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లైనా కూడా అదే ఫిజిక్.. అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తూ.. భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ.. యంగ్ భామలకు గట్టిపోటీనిస్తోంది. అప్పుడే ఐపోలేదు.. నెక్ట్స్ కూడా టఫ్ ఫైట్ ఇస్తానంటోంది.
Also Read : Sarvam Maya : 10 రోజుల్లో రూ.100 కోట్లు.. యంగ్ హీరో మాస్ కంబ్యాక్
రెండేళ్ల నుండి ఓటీటీకే పరిమితమై.. సిల్వర్ స్క్రీన్‌కు దూరమైన నయనతార.. తన అప్ కమింగ్ చిత్రాల్లో వర్సటైల్ క్యారెక్టర్స్‌తో 2.0ని చూపించబోతోంది. మన శంకర్ వరప్రసాద్ గారులో ఫ్యామిలీ ఉమెన్‌గా కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్.. టాక్సిక్‌లో కావాల్సినంత గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని రీసెంట్లీ రిలీజ్ చేసిన గంగ పోస్టర్ చెప్పకనే చెబుతోంది. అంతేకాదు.. బిల్లా తరహాలో యాక్షన్‌తో పాటు నెగిటివ్ రోల్ చేస్తుందన్న బజ్ నడుస్తోంది. మరో వైపు డివోషనల్ యాంగిల్ చూపించబోతోంది నయన్. మూకుత్తి అమ్మన్2తో అమ్మవారిగా కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్ రక్కాయ్‌లో రౌడీలను రప్ఫాడించబోతోంది. ఈ లేడీ ఓరియెంట్ ఫిల్మ్‌లో మారణాయుధాలు చేతబట్టి కీచకుల అంతు చూడబోతోంది. వీటితో పాటు కామెడీ ఎంటర్టైనర్ మన్నాగట్టి సిన్స్ 1960, మరో వైపు డ్రామా ఫిల్మ్ డియర్ స్టూడెంట్స్, హాయ్ చిత్రాలు చేస్తోంది. వీటికి తోడు బాలకృష్ణ ఎన్బీకే111లో యువరాణిగా కనిపించబోతోంది. ఒక్క ఇయర్‌లోనైనా డిఫరెంట్ షేడ్స్ చూపించి నాకు నేనే పోటీ.. నాకెవ్వరూ లేరు సాటి అని ఫ్రూవ్ చేయబోతోంది నయన్.