2015లో మలయాళ ఇండస్ట్రీని ఊపేసింది ప్రేమమ్. మలయాళ హీరో నివిన్ పౌలీ కెరీర్‌ని తిప్పేసిన సినిమా అది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్‌కు లైఫ్ ఇచ్చిన మూవీ. టెన్ ఇయర్స్ బ్యాక్ నాలుగు కోట్లతో సినిమా తీస్తే.. రూ. 75 కోట్లను వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది ఈ మూవీ. దీని తర్వాత నివిన్ చాలా సినిమాలే చేశాడు కానీ ఈ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. మళ్లీ పదేళ్ల తర్వాత సర్వం మాయతో సాలిడ్ సక్సెస్ చూసాడు.
Also Read : JanaNayaganTrailer : జననాయగన్ రీమెక్ కాదన్నారు.. కానీ భగవంత్ కేసరిని కాపీ పేస్ట్ చేశారు..
డిసెంబర్ 25న వచ్చిన సర్వం మాయ సూపర్ హిట్ సాధించింది. వృషభ లాంటి పెద్ద సినిమాను తట్టుకుని మరీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రిలీజైన 10 రోజుల్లోనే రూ. 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో ప్రేమమ్ పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ చేసింది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ ఫాంటసీ ఫిల్మ్‌కు మలయాళీలు ఫిదా అయ్యారు. నివిన్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది.. సర్వంమాయ. మైనే ప్యార్ కియాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బోల్తా పడ్డ ప్రీతి ముకుందన్ సర్వంమాయతో సక్సెస్ చూసింది. ఇక ఇందులో మెయిన్ లీడ్ రియా షిబు ఖాతాలో ఓ హిట్ పడింది. ప్రేమమ్ తర్వాత మళ్లీ ట్రాక్ ఎక్కిన నివిన్ పౌలీ ఈ మధ్య ఓ విలన్ రోల్‌కు షిఫ్టయ్యాడు. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్శ్ నుండి వస్తోన్న మూవీ బెంజ్‌లో లారెన్స్ రాఘవని ఢీ కొట్టబోతున్నాడు. ఇందులో వాల్టర్ అనే వయెలెంట్ విలన్‌గా కనిపించబోతున్నాడు. ఇవే కాక నయనతారతో జోడీ కడుతోన్న డియర్ స్టూడెంట్స్, బేబి గర్ల్ సెట్స్‌పై ఉండగా.. ఎప్పుడో కంప్లీటైన ఎజు కాదల్, ఎజు మలై విడదులకు సిద్దంగా ఉంది.