పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG). యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో, ఓ సాంగ్ గురించి జరిగిన ‘లీక్’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన హై వోల్టేజ్ సాంగ్ ఉంది.. ‘ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్’ అనే పాట. ఈ పాటను తమిళ స్టార్ శింబు పాడిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఈ పాట కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే..
అలాంటి టైంలో, ఈ పాట లీక్ అయ్యిందని మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ దర్శకుడు సుజీత్‌కి చెప్పడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. సాంగ్ రిలీజ్‌కి కొద్ది రోజుల ముందు, థమన్ సుజీత్‌కి ఫోన్ చేసి.. ‘పాట లీక్ అయిపోయింది.. ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు’ అంటూ చెప్పడంతో, షాక్‌కి గురైన సుజీత్ రియాక్షన్ కళ్ల ముందే ఓ థ్రిల్లింగ్ సీన్‌ని తలపించింది. ఈ మాటలతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. అయితే కొన్ని క్షణాలకే థమన్ అసలు విషయం బయట పెట్టాడు..
‘ఇది ప్రాంక్ మాత్రమే. పాట లీక్ కాలేదు’ అంటూ నవ్వుతూ చెప్పేశాడు. ఈ చిన్న డ్రామా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సుజీత్ రియాక్షన్ చూసిన అభిమానులు ఒక్కసారిగా పసిగట్టలేక షాక్ తిన్న, తర్వాత థమన్ చెప్పిన రివీల్‌తో రిలీఫ్ ఫీలయ్యారు. ఇలా సాంగ్ రిలీజ్‌కి ముందు చేసిన సరదా ప్రమోషన్ అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. దీంతో ‘ఫైర్ స్ట్రాం ఈజ్ కమింగ్’ పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఇప్పుడు OG ఫ్యాన్స్ కళ్ల్లో కౌంట్‌డౌన్ మొదలైపోయింది.
Our @MusicThaman prank call to Sujeeth 😁#TheyCallHimOG
— TheyCallHimOG (@TheOGBookings) August 1, 2025