Nushrratt Bharuccha: ప్రముఖ నటి నుష్రత్ భరూచా ఇటీవల ఉజ్జయినిలోని శ్రీ మహాకాలేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. మహాకాళేశ్వరుడి భస్మ హారతిలో ఆమె పాల్గొన్నారు. ఆయల పూజారులు ఆమెను శాలువాతో సత్కరించారు. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశ్యంతో నుష్రత్ ఆలయాన్ని సందర్శించారు. ముస్లిం మహిళ అయిన నుష్రత్, మహాకాల్‌ను సందర్శించడంపై ఇప్పుడు కొందరు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా, నుష్రత్‌పై ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Covid-19: కరోనాకు ఆరేళ్లు.. సరిగ్గా ఇదే రోజు కోవిడ్ మహమ్మారి ఎంట్రీ..
ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి మాట్లాడుతూ, షరియా చట్టం ప్రకారం ఆమె పూజలు చేయడం, గంధం పూసుకోవడం “ఘోర పాపం” అని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని ఆయన అన్నారు. నటి పశ్చాత్తాపం చెంది. కల్మా పఠించాలని మౌలానా డిమాండ్ చేశారు.
అయితే, నుష్రత్ భరూచా తన మత విశ్వాసాలపై తన ఉదారవాద అభిప్రాయాలను బహిరంగంగా వెల్లడించారు. శుభంకర్ మిశ్రాతో ఒక ఇంటర్వ్యూలో, ఈ నటి ఆలయం, మసీదు లేదా చర్చి అయినా వివిధ ప్రార్థనా స్థలాలలో శాంతిని పొందడాన్ని తాను నమ్ముతానని అన్నారు. ‘‘మీకు ఎక్కడ శాంతి లభిస్తే, అది మందిరంలో అయినా, గురుద్వారాలో అయినా, చర్చిలో అయినా మీరు అక్కడికి వెళ్లాలి, నేను ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నాను. నాకు సమయం దొరికితే, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తాను. ఒకే దేవుడు ఉన్నాడని, ఆయనతో అనుసంధానం కావడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయని నేను ఎప్పుడూ నమ్ముతాను. మరియు నేను ఆ మార్గాలన్నింటినీ అన్వేషించాలనుకుంటున్నాను,’’ అని ఆమె అన్నారు.
#WATCH उज्जैन, मध्य प्रदेश: अभिनेत्री नुसरत भरूचा महाकालेश्वर मंदिर में भस्म आरती में शामिल हुईं। pic.twitter.com/WexcORQv4U
— ANI_HindiNews (@AHindinews) December 30, 2025