జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు మనోజ్ అనుచరులు.దీంతో మనోజ్ అనుచరులను విష్ణు బౌన్సర్లు, అనుచరులు వారిని ఇంటి లోపలి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపద్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
Also Read : RGV Case : రామ్‌గోపాల్‌వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
ఇదిలా ఉండగా అసలు జల్ పల్లిలో మోహన్ బాబుకు మంచు మనోజ్ కు మధ్య ఏమి జరిగింది అనేది ఆయన ఇంట్లో పని చేసే పని మనిషి సంచలన నిజాలు బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ “మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వలన గొడవ మొదలైంది. అతడు చేసిన తప్పు కారణంగా మనోజ్ అన్న బెల్ట్ తీసుకుని ప్రసాద్ ను కొట్టాడు. ఆ టైమ్ లో మోహన్ బాబు కలగా జేసుకుని నా స్టాఫ్ ను కొట్టొద్దు నేను వాడికి భయం పెడతా, నువ్వు చెయ్ వేస్తె ఒప్పుకోను అని మనోజ్ ను నెట్టేశాడు. ఎవరికీ దెబ్బలు తగలలేదు. అన్నదమ్ముల మధ్య వీరికి మనస్పర్థలు ఉన్నాయి. భూమా మౌనికను చేసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఆమెకు మనోజ్ కంటే ముందుగా వేర్ అతనితో పెళ్లి అయి పిల్లాడు ఉన్నాడు. అందుకే ఎవరికీ ఇష్టం లేదు. అక్కని మనోజ్ అన్నకు బిడ్డ పుట్టినపుడు అందరు వచ్చారు. ఇప్పుడు తండ్రి కొడుకులవివాదాన్ని పరిష్కరించేందుకు మంచు లక్ష్మి సముదాయించే పని చేసింది” అని వెల్లడించింది.