యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు దొరికిన ఖాళీ సమయంలో వాలీబాల్ ఆడుతూ కనిపించారు. ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోను యంగ్ టైగర్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండగా భారీ ఎత్తున లైకులు, షేర్లు లభిస్తున్నాయి.
Read Also : మరో తమిళ హీరోతో రష్మిక రొమాన్స్
ప్రస్తుతం తారక్ “ఆర్ఆర్ఆర్” చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ “రణం రౌద్రం రుధిరం”పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో చరణ్ తో కలిసి ఎన్టీఆర్ మల్టీస్టారర్ చేస్తుండగా… రీసెంట్ గా భారీ హైప్ నెలకొన్న ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణను మేకర్స్ పూర్తి చేశారు. ఆగస్టు 1న ఫ్రెండ్ షిప్ డే కానుకగా ఈ సాంగ్ రిలీజ్ కానుంది. ఐదు భాషల్లో విడుదల కానున్న ఈ సాంగ్ ను ఐదుగురు ప్రముఖ సింగర్లు పాడారు. మరోవైపు సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇంకో సాంగ్ షూటింగ్ మిగిలి ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. అనంతరం కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్30 ప్రారంభం కానుంది. ఆ తర్వాత పప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ ఉంటుంది.
Hero Playing Volleyball❤️😍@tarak9999 #ManOfMassesNTR pic.twitter.com/Rn7D6oCpOz
— KICK Tollywood (@KickTwood) July 26, 2021