నందమూరి తారకరాముడి ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ వీడియో 50 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ భీమ్ ఇంట్రో వీడియోకు అదిరి పోయే రెస్పాన్స్ లభించింది. ఎన్టీఆర్ అభిమానులతో పాటు సాదారణ ప్రేక్షకులు కూడా ఈ వీడియోను తెగ చూసేస్తున్నారు. ఈ ఇంట్రో వీడియో విడుదలై దాదాపు ఆరు నెలలైంది. 50 మిలియన్ వ్యూస్ మాత్రమే కాదు 1.3 మిలియన్ లైక్స్ కూడా ఈ వీడియోకు వచ్చాయి. ఇక 53 వేల మంది డిస్ లైక్ కూడా చేశారు. భీమ్ వీడియోకు ముందు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రామరాజుగా నటిస్తున్న రామ్ చరణ్ వీడియో విడుదలైంది. ఆ వీడియోకు ఇప్పటి వరకూ 43 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమా పై జనాలలో ఉన్న అంచనాలను పీక్స్ కు తీసుకు వెళ్లిన వీడియోలు ఇవి. ఈ రెండింటితో సినిమా స్థాయి మరింతగా పెరిగిందన్నది వాస్తవం. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తో సినిమాకు సంబంధించిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్. అయితే వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రావచ్చన్నది ఓ రూమర్. చూద్దాం ఏం జరుగుతుందో!