సైఫ్ అలీ ఖాన్ దాడి కేసులో ప్రతిరోజూ కొత్త షాకింగ్ అప్‌డేట్‌లు వస్తున్నాయి. సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ దాడి కేసు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన షరీఫుల్ ఇస్లాం అసలు నిందితుడా కాదా అని ముంబై పోలీసులను సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో అరెస్టయిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌కు సంబంధించి వచ్చిన తాజా అప్‌డేట్‌లో సైఫ్ అలీఖాన్ ఇంట్లో లభించిన వేలిముద్రలు, షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలతో సరిపోలడం లేదని తెలుస్త్తోంది. దీంతో పోలీసులు చేసిన అరెస్టుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్ సైఫ్ అలీఖాన్ ఇంటి నుంచి 19 వేలిముద్రల నమూనాలను స్వాధీనం చేసుకుంది. అయితే షరీఫుల్ ఇస్లాం షాజాద్ వేలిముద్రతో ఏ ఒక్క నమూనా కూడా సరిపోలలేదు.
Tollywood: నటితో దర్శకుడి ప్రేమాయణం.. గుర్తు తెలియని నెంబర్తో లీకులు
ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు షరీఫుల్ ఇస్లాం షాజాద్ ను అరెస్ట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మరో పక్క ఇప్పటికే మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ తండ్రి బంగ్లాదేశ్ నుండి ఇదే విషయాన్ని ఇప్పటికే మీడియా ముందుకు వచ్చారు. సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి విడుదలైన సిసిటివి ఫుటేజీలో కనిపించే వ్యక్తి తన కుమారుడు షరీఫుల్ ఇస్లాం కాదని, ఎందుకంటే అతని శరీరాకృతి, అతని హెయిర్ స్టైల్ భిన్నంగా ఉంటాయని అన్నాడు. దానికి తోడు ఫోరెన్సిక్ బృందం తన నివేదికలో సీసీటీవీ ఫుటేజీలో కనిపించే వ్యక్తి షరీఫుల్ ఇస్లాం కాదని పేర్కొంది. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ఇంటి నుండి స్వాధీనం చేసుకున్న వేలిముద్రతో షరీఫుల్ ఇస్లాం వేలిముద్ర సరిపోలక పోవడం ముంబై పోలీసులకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఉంది. ఈ విషయమై సోషల్ మీడియాలో చర్చ కూడా సాగుతోంది. ఇక ఈ అంశం మీద పలువురు నెటిజన్లు ఇదేదో సినిమా కథను మించి ఉన్నట్టుందని కామెంట్స్ చేస్తున్నారు.