బాలయ్యకు వీరసింహ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. వీరసింహారెడ్డిలో బాలయ్య లుక్, గెటప్ కు ఫ్యాన్స్ నుండే కాదు ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. ఈ నేపథ్యంలో ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్ చేస్తున్నాడు గోపీచంద్ మలినేని. ఈ సినిమను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు. హిస్టారికల్ బాగ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్టు సమాచారం.
Also Read : Lokesh Kanakaraj : హీరోగా లోకేష్ కనకరాజ్.. టైటిల్ గ్లిమ్స్ రిలీజ్
కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ కోసం పలువురి పేర్లు పరిశీలించిన మేకర్స్ ఫైనల్ గా స్టార్ హీరోయిన్ నయనతారను ఫిక్స్ చేసారు. యువరాణికి చెందిన చాప్టర్ ను పరిచయం చేయబోతున్నామని ఈ సోమవారం మధ్యాహ్నం 12.01 గంటలకు అఫీషియల్ గా ప్రకటిస్తామని పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇదివరకు బాలయ్యతో శ్రీరామరాజ్యం, జై సింహ వంటి సూపర్ హిట్ మూవీస్ లో నటించింది లేడీ సూపర్ స్టార్ నయనతార. లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పడు మరోసారి బాలయ్యతో జోడి కడుతుంది నయన్. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నటు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా నవంబరు 7న పూజా కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. బాలయ్య కెరీర్ లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిచబోతున్నారు.