ఇండస్ట్రీలోకి ఎంతోమంది కొత్త హీరోయిన్‌లు వస్తుంటారు పాత వాళ్ళు కనుమరుగవుతూ ఉంటారు. కానీ కొంతమంది నటిమనులు మాత్రం అదే క్రేజ్ కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి నయనతార ఒకరు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాల కాలం పూర్తి అయిన, ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి కూడా నయనతారనే. బాలీవుడ్‌ల్లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, అక్కడ కూడా హిట్ కొట్టింది. ప్రజంట్ వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో బిరుదు ఉంటుంది. అలాగే నయనకి కూడా తన టాలెంట్ తో లేడీ సూపర్ స్టార్ అనే బిరుదు అందుకుంది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా ఈ బిరుదు పై ఒక నోట్ ను విడుదల చేసింది నయన తార.
‘నా అభిమానులు ఎంతో ప్రేమతో నను లేడీ సూపర్ స్టార్ అని పిలవడం ఆనందంగా ఉంది. కానీ నయనతార పేరే నా హృదయానికి దగ్గరైంది. ఆ పేరు నటిగానే కాకుండా వ్యక్తిగానూ నేనేంటో తెలియజేస్తుంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా సక్సెస్‌ల్లో, కష్ట సమయంలో మీరు అంతా అండగా ఉన్నారు. మీరెంతో ప్రేమతో ఇచ్చిన ఈ లేడీ సూపర్ స్టార్ బిరుదుకు నేను రుణపడి ఉంటా. కానీ, నయనతార అని పిలిస్తేనే నాకు ఆనందం. లేడీ సూపర్ స్టార్ లాంటి బిరుదులు వెలకట్టలేనివి. వాటివల్ల కంఫర్ట్ గా ఉండలేని పరిస్థితి కూడా ఉంటుంది. సినిమా మనందరినీ ఐక్యంగా ఉంచుతుంది. దాన్ని ఎప్పుడూ సెలబ్రేట్ చేసుకుందాం’ అని ఈ నోట్‌లో పేర్కొంది ముద్దుగుమ్మ.