ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది రష్మిక. ఆ తర్వాత భీష్మ, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు హిట్స్ తో అనంతి కాలంలోనే టాలీవుడ్ అగ్రకథానాయికగా ఎదిగింది ఈ కన్నడ బ్యూటి. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మడు తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోతో ఈమె చేసిన పుష్ప రేష్మనుకను నేషనల్ క్రష్ రష్మిక గా మార్చేసింది.
Also Read : Suhas : జనక అయితే గనక ప్రీమియర్ టాక్..!
అయితే రష్మిక ఇండస్ట్రీ అడుగు పెట్టకముందుకు ఆమె 19 ఏళ్ల వయసులో కొన్నిఆడిషన్స్ ఇచ్చింది. అప్పట్లో ఒక డైలాగ్ చెప్పడానికి ఈ బ్యూటీ ఎన్ని అవస్థలు పడిందో తెలిపే రష్మిక కన్నడ ఇండస్ట్రీలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అయ్యింది. అప్పట్లో కొన్నిఆఫర్స్ కోసం రష్మిక మందన్న హాజరైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ‘నా పేరు రష్మిక. వయస్సు 19 సంవత్సరాలు. ఎత్తు 5.5. నేను రెండవ సంవత్సరం B.A. చదువుతున్నా. నేను ఆడిషన్‌కి రావడం ఇదే తొలిసారి’ అని రష్మిక మందన్న వచ్చి రాని కన్నడలో ఎక్కువగా ఇంగ్లీషులో చెబుతోంది. ‘సాధ్యమైనంత వరకు కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించండి’ అని అక్కడున్న ఆడిషన్ నిర్వహించే వ్యక్తి చెప్పగా. ‘ఫస్ట్ టైమ్ ఆడిషన్’ అని బదులిచ్చింది. నటనతో పాటు డాన్స్ లో తనకున్న అనుభవాన్ని ఆడిషన్స్ లో ప్రదర్శించింది . ఈ ఆడిషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#RashmikaMandanna first audition video at the age of 19 🫡pic.twitter.com/oU1cLZ3XqK
— Movies4u Official (@Movies4u_Officl) October 7, 2024