కలర్ ఫోటోతో సూపర్ హిట్ కొట్టిన సుహాస్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్ లు కొడుతున్నాడు. అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ‘ప్రసన్న వదనం’ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరో సుహాస్ మరో సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో ‘జనక అయితే గనక’ సినిమాతో ఆడియెన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా అక్టోబరు 12న రిలీజ్ కానున్న ఈ చిత్రం రిలీజ్ కానుంది.
Also Read : Jr.NTR : దేవర టార్గెట్ ఎంత.. రాబట్టింది ఎంత..?
కాగా కొద్దీ రోజల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేశారు. హీరో సుహాస్, దర్శకుడు సందీప్, నటుడు వెన్నెల కిశోర్ తో పాటు నిర్మాత దిల్ రాజు వారితో కలిసి సినిమా చూశారు. సుహాస్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లో ఇది బెస్ట్ మూవీ అవుతుందన్నారు ప్రేక్షకులు. అలాగే ఈ ఆదివారం విజయవాడలోని రాజ్ థియేటర్ లో స్పెషల్ ప్రీమియర్ వేయగా యూత్ ఆడియన్స్ నుండి మంచి టాక్ తెచ్చుకుంది. వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారని, చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఉందని అన్నారు ఆడియన్స్. కానీ కొందరు మాత్రం మిశ్రమ స్పందను తెలియజేసారు. కంటెంట్ కొత్తగా ఉన్న తెరపై చూపించడంలో దర్శకుడు తడబడ్డాడని కొందరు తమ అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే సుహాన్ అద్భుతంగా నటించాడని కితాబునిచ్చారు. ఈ సినిమాపై నమ్మకంతో ఓవర్సీస్ రైట్స్ కొనుగోలు చేసి తానే సొంతగా రిలీజ్ చేస్తున్నాడు హీరో సుహాస్