టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. మ్యాడ్, మ్యాడ్ 2, ఆయ్ చిత్రాలతో తనకంటూ యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నితిన్ సోలో గా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’. ఇప్పటివరకు మల్టీస్టారర్‌లో నటించిన నితిన్ తాజాగా శ్రీ ఈ మూవీతో డెబ్యూ ఇవ్వబోతున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుంగడగా.. శ్రీ వేదాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
Also Read : Akhil : ‘లెనిన్’ మూవీలో బాలీవుడ్ హీరోయిన్.. !
ఈ ట్రైలర్ గురించి మాట్లాడుకూంటే.. సిగరెట్‌కి అలవాటయిన ఒక యువకుడి చుట్టూ కథ ఉండబోతున్నట్లు తెలుస్తుంది. నితిన్‌తో పాటు ఈ సినిమాలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరియు, రమ్య, ప్రియ మచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కైలాష్ మీనన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఫ్యామిలి ఎంటర్‌టైనింగ్ మూవీగా రాబోతునట్లుగా తెలుస్తోంది. కంటెంట్ కూడా డిఫరెంట్ గా అనిపించింది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.