నేచురల్ స్టార్ నాని నటించిన హైలీ హైప్డ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. డాక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాని వాల్ పోస్టర్ సినిమా మరియు నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. టీజర్, ట్రైలర్, పాటలతో విడుదలకు ముందే దేశవ్యాప్తంగా ఈ సినిమా సంచలనం సృష్టించింది. HIT: The 3rd Case మే 1న పాన్-ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ ఆకర్షణీయ సందర్భంలో నాని మీడియాతో సినిమా విశేషాలను షేర్ చేసుకున్నారు.
HIT 3 కోసం దేశం మొత్తం తిరిగారు కదా… రెస్పాన్స్ ఎలా ఉంది?
అదిరిపోయింది! షూటింగ్ కోసమూ, ప్రమోషన్స్ కోసమూ దేశం నలుమూలలా తిరిగాం. ఆడియన్స్ నుంచి సూపర్ క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూడాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. రిలీజ్‌కి ముందే ఇలాంటి పాజిటివ్ వైబ్ రావడం మాకు ఫుల్ ఖుషీ ఇచ్చింది.
HIT 3 టీజర్, ట్రైలర్‌లో వైలెన్స్ బాగా కనిపిస్తోంది. ఇది ఎలాంటి సినిమా?
HIT ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాలు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్. కానీ HIT 3 కథ డిమాండ్ చేసినట్లు యాక్షన్, వైలెన్స్‌తో వచ్చింది. ఇది రొటీన్ సినిమాల్లా కాదు, టోటల్ స్టైలిష్‌గా, రిలేటబుల్‌గా ఉంటుంది. కథలో ఆర్గానిక్‌గా వచ్చిన కొన్ని ఎలిమెంట్స్ వల్ల సినిమా చూస్తున్నప్పుడు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. వైలెన్స్ కోసం ఈ సినిమా తీయలేదు, కథలో భాగంగా అది నాచురల్‌గా వచ్చింది. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది.
మీ సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తారు. వైలెన్స్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా?
అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఇది డిఫరెంట్ జానర్ సినిమా. టార్గెట్ ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేస్తే సినిమా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. HIT 3 టార్గెట్ ఆడియన్స్‌ని 100% మెప్పిస్తుందని నమ్మకం ఉంది.
మీరు బాయ్-నెక్స్ట్-డోర్ ఇమేజ్‌తో స్టార్ట్ చేసి, నేచురల్ స్టార్‌గా మారి, ఇప్పుడు వైలెంట్ సినిమాలు చేస్తున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి?
నేను దీన్ని ట్రాన్స్‌ఫర్మేషన్‌గా చూడట్లేదు. ప్రతి సినిమాని కొత్త జానర్‌లో ట్రై చేయాలని చూస్తా. హాయ్ నాన్న, జెర్సీ, దసరా, ఇప్పుడు HIT 3… ఇలా వేర్వేరు జానర్స్‌లో సినిమాలు చేశా. HIT 3లో వైలెన్స్ అంటే కథ డిమాండ్ చేసినట్లు వచ్చింది. స్క్రీన్‌పై వైలెన్స్ చూస్తే డిస్టర్బ్ అవ్వదు, బదులు ఎంజాయ్ చేసేలా ఉంటుంది. సలార్ యాక్షన్ చూసినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో, ఇందులో కూడా అలాంటి ఫీల్ ఉంటుంది. కానీ కేస్‌కి సంబంధించిన ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలో వైలెన్స్ ఎలా ఉంటుందో, ఇందులో కూడా అలాంటిదే.
డీవోపీ షాన్ వర్గీస్ గురించి?
షాన్ వర్గీస్ అద్భుతమైన సినిమాటోగ్రాఫర్. ఆయన విజువల్స్‌తో కథ చెప్పడానికి ట్రై చేస్తారు. ప్రతి ఫ్రేమ్ వెనక ఒక లక్ష్యం ఉంటుంది. ఆయన షాట్ సెట్ చేస్తే, ఆడియన్స్ ఏ ఎమోషన్ ఫీల్ అవ్వాలో అది క్లియర్‌గా ఉంటుంది. ఆయన విజువల్స్ ఎమోషన్స్‌ని మరింత ఎలివేట్ చేస్తాయి. HIT 3కి ఆయన సూపర్ ఇంపాక్ట్‌ఫుల్ కెమెరా వర్క్ ఇచ్చారు.
మిక్కీ జే మేయర్‌ని తీసుకున్న కారణం?
మిక్కీ టాప్-నాచ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటివరకు ఫీల్-గుడ్ సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ థ్రిల్లర్ జానర్‌లో ఆయన వర్క్ చేయలేదు. ఆయన థ్రిల్లర్ చేస్తే సౌండ్ టోటల్ ఫ్రెష్‌గా ఉంటుందని భావించి తీసుకున్నాం. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్‌కి ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
సినిమాలో కొంత భాగం పహల్గామ్‌లో షూట్ చేశారని విన్నాం…
అవును, పహల్గామ్‌లో విభిన్న లొకేషన్స్‌లో 18 రోజులు షూట్ చేశాం. కానీ ఇటీవల జరిగిన ఓ ఘటన మమ్మల్ని బాగా కలిచివేసింది. అలాగే, షూటింగ్ సమయంలో మా డీవోపీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మరణించడం మమ్మల్ని చాలా బాధించింది.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి గురించి?
ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంది. శ్రీనిధి అద్భుతంగా నటించింది. ఆమె క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఎక్కువ రివీల్ చేయడం కరెక్ట్ కాదు. ఆమె సినిమాని సొంతం చేసుకున్నట్లు నటించడమే కాక, ప్రమోషన్స్‌లో కూడా ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంది. ఆడియన్స్‌లో ఆమెకి సూపర్ క్రేజ్ ఉంది, ఈ సినిమాకి ఆమె బిగ్ ప్లస్.
ఇంత రా, ఇంటెన్స్ క్యారెక్టర్స్ చేయడం, ఆ క్యారెక్టర్ నుంచి బయటపడటం కష్టం కదా?
ఏదైనా ఎక్సైట్‌మెంట్ ఉంటే కష్టం అనిపించదు. నేను నా వర్క్‌ని ఫుల్ ఎంజాయ్ చేస్తా. అందుకే నాకు ఇది ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు.
HIT 3 సినిమా మీరే చేయడానికి కారణం?
అది కథ డిమాండ్. నేను ఈ సినిమా ఎందుకు చేశాను, దాని వెనక రీజన్ ఏంటి అనేది సినిమా చూసినప్పుడు మీకే క్లియర్ అవుతుంది.
రాజమౌళి గారు HIT ఫ్రాంచైజీ ఈవెంట్స్‌కి చీఫ్ గెస్ట్‌గా రావడం ఎలా అనిపిస్తుంది?
రాజమౌళి గారు నాకు ఫ్యామిలీ మెంబర్ లాంటివారు. ఎంత బిజీలో ఉన్నా ఈవెంట్ కోసం వచ్చారు, అది మాకు సూపర్ హ్యాపీ మూమెంట్. మూడు HIT సినిమాలకూ ఆయన చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఇక నెక్స్ట్ సినిమాకి ఆయన రాకపోతే ఏం చేయాలా అని టెన్షన్ స్టార్ట్ అయింది (నవ్వుతూ).
HIT 3 అడ్వాన్స్ బుకింగ్స్ వైల్డ్‌ఫైర్ లాగా ఉన్నాయి. ఎలాంటి ఓపెనింగ్స్, నంబర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?
నంబర్స్ గేమ్‌లో నేను కాస్త వీక్. కానీ ఈ మధ్య ఆడియన్స్ థియేటర్స్‌కి రావడం తగ్గిందని వింటున్నాం. కానీ HIT 3 అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఫుల్ జోష్‌గా అనిపిస్తోంది. ఎక్సైటింగ్ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఖచ్చితంగా థియేటర్స్‌కి వస్తారని నా బిలీఫ్.
HIT 3లో ఎలాంటి ఎమోషన్ ఉంటుంది?
సినిమాలో బలమైన ఎమోషనల్ హై ఉంది, అది ఒక ప్రామిస్‌కి రిలేటెడ్. అది చాలా బ్యూటిఫుల్‌గా కనెక్ట్ అవుతుంది. దాన్ని మీరు బిగ్ స్క్రీన్‌పై చూసి ఫీల్ అవ్వాలి.
HIT 3తో పాటు ఇతర సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ కాంపిటీషన్‌ని ఎలా చూస్తారు?
అన్ని సినిమాలూ బాగా ఆడితే మా సినిమా ఇంకా బెటర్ రన్ అవుతుంది. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లందరం అన్ని సినిమాలూ సూపర్ హిట్ కావాలని కోరుకోవాలి. అన్ని సినిమాలూ హిట్ అయితే బిజినెస్ గ్రో అవుతుంది, ఓవరాల్‌గా ఇండస్ట్రీ బాగుంటుంది.
మీ సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆడియన్స్‌లో నమ్మకం ఉంది. ఈ ట్రస్ట్ సంపాదించడం ఎలా అనిపిస్తుంది?
నా పనిని నిజాయితీగా చేస్తూ వెళ్లడం వల్ల ఆడియన్స్‌లో ఈ నమ్మకం వచ్చింది. నన్ను, ఆడియన్స్‌ని సెపరేట్‌గా చూడను. నేను కూడా ఆడియన్స్‌లో ఒకడినే అనే ఫీల్‌తో సినిమాలు చేస్తా.
మునుపటి HIT సినిమాలతో పోలిస్తే HIT 3లో డిఫరెన్స్ ఏంటి?
మునుపటి రెండు HIT సినిమాలతో పోలిస్తే ఇందులో క్లియర్ డిఫరెన్స్ ఉంది. అది టీజర్, ట్రైలర్‌లోనే హింట్ ఇచ్చాం. ఈ సినిమా వరల్డ్ టోటల్ డిఫరెంట్. థియేటర్‌లో అదిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. అందుకే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత క్రేజీగా ఉన్నాయని ఫీల్ అవుతున్నా.
డైరెక్టర్ శైలేష్ కొలను గురించి?
శైలేష్ ఇంటెన్స్ యాక్షన్ సినిమాలు తీస్తాడు కానీ, పర్సనల్ హ్యూమర్ సెన్స్ ఉన్న మనిషి. మాటల్లోనే జోక్స్ పేలిపోతాయి. అతనికి కామెడీ స్క్రిప్ట్ రాయమని చెప్పాను. అతను కామెడీ రాస్తే అది సూపర్ హిట్ అవుతుంది.
పారడైజ్‌లో వైలెన్స్ HIT 3 కంటే ఎక్కువ ఉంటుందా?
రెండూ ఒక్కో సినిమాకి ప్రత్యేకం. పారడైజ్ ఎపిక్ స్కేల్‌లో ఉంటుంది, HIT 3 ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.
చిరంజీవి గారి ఫ్యాన్‌గా ఆయనతో సినిమా నిర్మించడం ఎలా అనిపిస్తుంది?
ఇంకా డైజెస్ట్ కావడం లేదు (నవ్వుతూ). ఇది నాకు ప్రౌడ్ మూమెంట్.