నందమూరి నట సింహం బాలయ్య వారడుసు నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసంఫ్యాన్స్ ఎప్పటినుండో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. గతేడాది మోక్షు పుట్టిన రోజు కానుకగా డెబ్యూ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు మేకర్స్. హనుమాన్ వంటి సువర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు మొదటి సినిమా రాబోతుంది. ఈ సినిమాను SLV, LEGEND ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read : Allu Arjun : నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
కానీ పూజా కార్యక్రమాలతో సినిమా స్టార్ట్ అవుతుంది అనుకునే టైమ్ లో ఈ సినిమా వాయిదా పడింది. ఒకానొక దశలో ఈ సినిమా ఇక ఉండదు అని కూడా వార్తలు వెలువడ్డాయి. దింతో నందమూరి ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సహం చెందారు. అయితే మోక్షు రెండవ సినిమా స్టార్ట్ అవబోతుందని మరోసారి న్యూస్ చక్కర్లు కొట్టాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ మోక్షు రెండవ సినిమా నిర్మాత సితార నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ సినిమా తప్పకుండా ఉంటుంది. ఫిబ్రవరి నుండి ఆ సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ సినిమా కథ కూడా నేను విన్నాను అద్భుతంగా ఉంది. మా మిత్రుడు సుధాకర్ చెరుకూరి గ్రాండ్ స్కేల్ లో ఆ సినిమాను నిర్మిస్తారు. తప్పకుండా మోక్షు, ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుందని వెల్లడించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ అభిమాన హీరో వారసుడిని వెండితెరపై చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.