సినిమలను మ్యూజిక్ డైరెక్టర్లు ముంచేస్తున్నారా..? అనిరుధ్ కరెక్ట్ టైంకి మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల ఓ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..? చివరి నిమిషంలో పుష్ప2లోకి థమన్ ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడు..? రెహమాన్ బాటలో ఈ స్టార్ సంగీత దర్శకులు నడుస్తున్నారా..? అసలు ఏమైంది వాళ్లకు అనే చర్చ మొదలైంది. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ డిసెంబర్ 5న బాక్సాఫీస్ బెండు తీసేందుకు రెడీ అయ్యాడు. తగ్గేదెలే అంటూ పబ్లిసిటీని స్పీడప్ చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ కూడా స్టార్టయ్యాయి. ఈ మంత్ ఎండింగ్ నాటికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని సినిమా రెడీ అవుతుందని మేకర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే లాస్ట్ మినిట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది టీంకి. దేవీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బన్నీకి నచ్చకపోవడంతో థమన్ తీసుకున్నారని గట్టిగా బజ్ నడుస్తోంది. దీంతో కొత్త టెన్షన్ నెలకొంది. వచ్చే నెల 5న వస్తుందా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే మరో మ్యూజిక్ డైరెక్టర్ ది కూడా అదే బాట.
Dil Raju : టాలీవుడ్ హీరోకి స్టేజిపైనే దిల్ రాజు షాకింగ్ కౌంటర్
ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్. యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఆయన భారీ బడ్జెట్ చిత్రాలకు వర్క్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఓ చిన్న సినిమా పట్ల శీత కన్ను వేశాడు . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న మూవీకి సంబంధించి ఫైనల్ మ్యూజిక్ ఇవ్వలేదు అనిరుధ్. దీంతో డిసెంబర్ రిలీజ్ నుండి మూవీ ఔట్ అయ్యిందని టాక్ నడుస్తోంది. చివరకు సినిమా వాయిదా వేయక తప్పని పరిస్థితి. అలాగే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌కు పిచెక్కిపోయే క్రేజ్ ఉన్నా కానీ ఆలస్యంగా కంపోజ్ చేస్తాడన్న అపవాదు ఉంది. డైరెక్టర్ చెప్పిన టైంకి ఇవ్వడని ఇండస్ట్రీలో నెగిటివ్ ముద్ర ఉంది. అందుకే శంకర్ తన ఆస్థాన సంగీత దర్శకుడ్ని గత రెండు సినిమాల నుండి కంటిన్యూ చేయట్లేదు. భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ చిత్రాలకు అనిరుధ్, థమన్లను తెచ్చిపెట్టుకున్నాడు. అనిరుధ్ ఫోన్స్ ఎత్తడని, థమన్ చివరి వరకు టెన్షన్ పెడతాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవి ఈ లెగసీని కంటిన్యూ చేస్తున్నాడని అంటున్నారు. అయితే ఈ ఆలస్యం.. బిజీ షెడ్యూల్ వల్ల కాకుండా.. మ్యూజికల్ కాన్సర్ట్, ఎక్స్ ట్రా కార్యక్రమాల కారణంగా కంపోజింగ్ లేటవుతుందన్న రిమార్క్ పడింది. ఇప్పటి వరకు దేవీకి తన తోటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో పోల్చుకుంటే.. మంచి నేమ్ ఉంది కానీ పుష్ప 2తో ఈయన కూడా వెళ్లి ఆ స్కూల్లో వాళ్ళ పక్కనే కూర్చున్నాడు. దీంతో ఈ కంపోజర్లకు ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్.