ఘట్టమనేని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, ఒక్కడు సినిమాలను రీరిలీజ్ చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో మహేష్ ఫ్యనస్ హంగామా మాములుగా లేదు. మహేష్ కల్ట్ క్లాసిక్ సినిమాలు చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ ,మీడియాలో హల చల్ చేస్తున్నాయి.
Also Read: Tollywood : నువ్వా నేనా.. రెండు సినిమాలు పోటాపోటీ.. గెలిచేదెవరు.?
అటు వైపు సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు మహేష్ కు బర్త్ డే విషెస్ తెలుపుతునన్నారు. కృష్ణ వంశీ దర్శకత్వం వచ్చిన మురారి అప్పట్లో కల్ట్ క్లాసిక్. మహేష్ ను ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన సినిమా ఆది. అప్పట్లో సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మూవీ రీ రిలీజ్ లో ఫ్యాన్స్ సందడి అంతా ఇంత కాదు. ప్రత్యేకంగా మురారిలోని పాటలు నెక్స్ట్ లెవల్. మరి ముఖ్యంగా ‘అలనాటి రామచంద్రుడు’ పాట ఎంతో ఫెమస్. ఎక్కడ పెళ్లి జరిగిన ఈ పాట తప్పనిసరి. కాగా మురారి రీరిలీజ్ అయిన ఓ థియేటర్ లో ఓ జంట అలనాటి రామచంద్రుడు పాటలో సోనాలి, మహేష్ మాదిరి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లిని ఫ్యాన్స్ కెమెరాలో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అలాగే కొన్ని థియేటర్స్ లో అక్షింతలు కూడా చల్లుకుంటూఫ్యాన్స్ చేస్తున్న ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Nijam ga pelli cheskunaru🤣🔥 #Murari4K pic.twitter.com/kRABlUVBWM
— VardhanDHFM (@_VardhanDHFM_) August 9, 2024