మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న మాస్ యాక్షన్ చిత్రం మిస్టర్ బచ్చన్. బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటించిన ‘రైడ్’ అఫీషియల్ రీమేక్ ఈ మిస్టర్ బచ్చన్. సేమ్ టు సేమ్ కాకుండా మూల కథను తీసుకుని మిగిలిన కథను రవితేజకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేసారు మేకర్స్. ఆగస్టు 15న రిలిజ్ అయింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై TG. విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించారు.
Also Read: Allu Arjun : స్నేహితుడికి ఎప్పుడు.. ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఏకైక వ్యక్తి
మిస్టర్ బచ్చన్ సినిమాను 14న అనగా బుధవారం రెండు తెలుగు రాష్ట్రాలలో స్పెషల్ ప్రీమియర్స్ తో ఒకరోజు ముందుగానే గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. రవితేజ మాస్ పెర్ఫామెన్స్ కు, భాగ్యశ్రీ బోర్స్ అందాల ఆరబోత ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అందిస్తున్నాయి. ముఖ్యంగా రెప్పల్ డప్పుల్, నల్లంచు తెల్లచీర సాంగ్స్ లో మాస్ రాజా, భాగ్యశ్రీ కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యామియోలో DJ టిల్లు స్టార్ బాయ్ సిద్దుజొన్నలగడ్డ మెరిశాడు. అయితే సిద్దు కనిపించిన కాసేపు ఆడియెన్స్ ను ఒక ఊపు ఊపేసాయి. ఫైట్ సిక్వెన్స్ లో కనిపించే సిద్దు తనదైన పంచులతో అదరగోట్టాడు. ఈ సీన్స్ మిస్టర్ బచ్చన్ కె హైలైట్ గా నిలుస్తాయనడంలో సందేహమే లేదు. అలాగే టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా ఒక పాటలో కనిపించాడు. మాస్ మహారాజతో కలిసి స్టెప్పులేసి అలరించాడు దేవి. దేవి స్పెషల్ ఎంట్రీ ఆడియన్స్ తో విజిల్స్ వేయించింది. మొత్తానికి అతిధి పాత్రల్లో మెరిసి అదరగొట్టారు సిద్దు జొన్నలగడ్డ, దేవిశ్రీ ప్రసాద్.