Tollywood Percentage War: మెగాస్టార్ వద్దకు ఎగ్జిబిటర్ల పంచాయితీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా నిర్మాతలు, నైజాం థియేటర్ ఎగ్జిబిటర్ల మధ్య నడుస్తున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం ఇప్పుడు తారా స్థాయికి చేరింది. రెంట్ విధానాన్ని పక్కన పెట్టి కలెక్షన్లను బట్టి పర్సంటేజ్ శ్లాబ్ విధానాన్ని అమలు చేయాలంటూ తెలంగాణ ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నైజాం థియేటర్ ఎగ్జిబిటర్లు ఈ వివాదం విషయంలో చిరంజీవిని కలుస్తామని కూడా చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో, నేడు (సోమవారం) సాయంత్రం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ (PEDDI) జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే, ఈ వివాదం కారణంగా ‘పెద్ది’ రిలీజ్‌కు ఇబ్బందులు ఎదురుకాకూడదని ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ మొదట భావించినప్పటికీ.. ఈ సినిమా నుంచే పర్సంటేజ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. ‘పెద్ది’ లాంటి భారీ చిత్రాలకు తాము వ్యతిరేకం కాదని, కానీ ఈ సమస్యను ఇప్పుడే తేల్చకపోతే భవిష్యత్తులో నిర్మాతలు తమను పట్టించుకోరనే ఆందోళనను ఎగ్జిబిటర్లు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ‘పెద్ది’ సినిమాను కూడా పర్సంటేజ్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావాలని, దీనిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని వారు చిరంజీవిని కోరనున్నారు. గతంలో కూడా చిత్ర పరిశ్రమకు ఎలాంటి కష్టాలు వచ్చినా, వివాదాలు తలెత్తినా చిరంజీవి గారు ముందుండి నడిపించారు. ఇప్పుడు ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్స్ గిల్డ్ మధ్య ఉన్న ఈ ఇంధన సందిగ్ధతను తొలగించేందుకు ఆయన మధ్యవర్తిత్వం వహించనున్నారని అంటున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..