లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని నార్సింగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేసినట్లు మస్తాన్ సాయిపై ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ గా గడిపిన వీడియోలుతో మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
MG ZS EV Price : కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎంజీ కంపెనీ.. ఆ కారుపై భారీగా ధర పెంపు
ఇదే క్రమంలో లావణ్య కు చెందిన కొన్ని వీడియోలను రికార్డ్ చేసిన మస్తాన్ సాయి ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది. మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వీడియోలను పోలీసులకు లావణ్య అందజేసింది. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకు పైగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక మరోపక్క గతంలో డ్రగ్స్ లో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి అప్పట్లో కూడా వార్తల్లోకి ఎక్కాడు. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.