అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు. చివరిగా ‘గుంటూరు కారం’ మూవీ తో అలరించిన మహేశ్ ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్ట్‌లో ఫుల్ బిజిగా ఉన్నాడు. అయితే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేశ్ బాబు పాత సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. ముందుగా ‘మురారి’, ‘బిజినెస్‌మెన్’ సినిమాలు రీరిజ్ అయ్యి మంచి సక్సెస్‌ఫుల్ రన్ ఇచ్చిన తర్వాత, మహేష్ సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. దీంతో తాజాగా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ కూడా రీ రిలీజ్ చేశారు. అన్‌సీజన్‌లో కూడా థియేటర్లలో ఈ మూవీ వసూళ్ల హంగామా చేసేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీంతో ఇప్పుడు మహేశ్ బర్త్‌డే కానుకగా ఆగస్టు 9న ఆయన బ్లాక్ బస్టర్ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది.
Also Read : Priyadarshi : అదే నా డ్రీమ్ రోల్
మహేశ్ కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రాల్లో ‘అతడు’ ఒకటి. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీకి మణిశర్మ సంగీతం, నాజర్ సెంటిమెంట్, సోను సూద్ , బ్రహ్మానందం కామెడీ, త్రిష గ్లామర్ అన్నీ కలిపి ఎంతో ఆకట్టుకున్నప్పటికి, అప్పట్లో థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ లాభాలను అందుకోలేకపోయింది. కానీ టీవీ ప్రీమియర్ తర్వాత రికార్డు స్థాయిలో టెలికాస్ట్ అయ్యింది. అందుకే ఇప్పుడు రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ 4K రీ మాస్టర్ పనులు ప్రారంభమవగా, స్పెషల్ సౌండ్ మిక్సింగ్‌తో మరింత బేస్ పెంచేందుకు టెక్నికల్ టీమ్ కష్టపడుతోందట. అంతేకాదు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర ఇప్పటికే పోటీ మొదలైనట్లు సమాచారం.