Shekar Master : బూతు స్టెప్పులకు బ్రాండ్ అంబాసిడర్ గా శేఖర్ మాస్టర్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సినిమాలలో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ లా పేరు ఏదైనా వాటికి స్పెషల్ క్రేజ్ ఉందనేది వాస్తవం. ఇప్పటి స్టార్ దిగ్గజ దర్శకులైన రాజమౌళి, సుకుమార్ సినిమాలలో సైతం ఐటం సాంగ్స్ ఉండాల్సిందే. అయితే ఈ సాంగ్స్ కొరియోగ్రఫిలో హద్దులు దాటకుండా చూసుకుంటారు సదరు దర్శకులు. కొరియోగ్రాఫర్స్ కూడా అందుకు తగ్గట్టే సాంగ్ ను కంపోజ్ చేస్తారు. కానీ ఇప్పుడు రాను రాను ఈ సాంగ్స్ లో భావం పక్కకి వెళ్లి, భూతు అగ్ర తాంబూలం అందుకుంటుంది.
ముఖ్యంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చేస్తున్న సాంగ్స్ కొరియోగ్రఫి బూతుకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటోంది. మిస్టర్ బచ్చన్ లో సాంగ్ శృతిమించింది అనుకుంటే మొన్న వచ్చిన “డాకు మహారాజ్ లోని దబిడి దిబిడి సాంగ్ భారీ ట్రోలింగ్ కు గురైంది. హీరోయిన్ పిరుదుల మీద బాదడం ఏంటని నెటిజన్స్ శేఖర్ ను దుమ్మెత్తిపోశారు. ఇక తాజాగా నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలోని “అదిదా సర్ప్రైజు” పాటలో కేతిక శర్మ స్టెప్పులు చూస్తే శేఖర్ లోని బూతు పరాకాష్టకు చేరిందనే చెప్పాలి. మరి ముఖ్యంగా కేతిక శర్మ కాస్ట్యూమ్స్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసాయి. కేతిక శర్మ యద అందాలను మొత్తం మల్లెపూలతో కప్పి ఆమెతో శేఖర్ వేయించిన స్టెప్పులు అతి జుగుప్సాకరంగా ఉన్నాయి. సినిమా చూసేందుకు ఫ్యామిలి ఆడియెన్స్ వస్తారు అనేది మరిచిపోయి రికార్డింగ్ డాన్స్ లా పాటను కంపోజ్ చేసాడు శేఖర్. ఒకప్పుడు గీత దాటకుండా ఐటం సాంగ్స్ ను తన అద్భుతమైన కంపోజింగ్ ఆడియెన్స్ ను అలరించిన శేఖర్ ఇప్పుడు తనలోని డాన్స్ మాస్టర్ కు దుప్పటి కప్పి పడుకోబెట్టి బూతు స్టెప్స్ తో హీరోయిన్స్ ని బంతిలాగా ఆడుకుంటున్నాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
- Producer Naga Vamsi: నిర్మాతలు ఎందుకు కొట్టుకుంటారో చెప్పేసిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
- Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
- Niharika Konidela: బంగారు బోనం ఎత్తిన నిహారిక కొణిదెల.. పాతబస్తీ మహంకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు!
తాజావార్తలు
-
DC OTT Release: థియేటర్లలో ‘డీసీ’ హంగామా.. అప్పుడే ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్!
-
Producer Naga Vamsi: నిర్మాతలు ఎందుకు కొట్టుకుంటారో చెప్పేసిన నాగవంశీ.. ఆ రోజులు పోయాయంటూ కామెంట్స్!
-
Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ ‘మియా భాయ్’ సక్సెస్ స్టోరీ!
-
iQOO Neo 11 Ultra: iQOO Neo 11 Ultra రిలీజ్ డేట్ ఫిక్స్.. 9000mAh బ్యాటరీ, Dimensity 9500, 16GB RAMతో!
-
Raveena Tandon: అందరూ చూస్తుండగానే.. స్టార్ నటి రవీనా టాండన్‌పై కుక్క అటాక్! చివరి క్షణంలో.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!