Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manoj Manchu: మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మనోజ్ మంచు, ఆయన భార్య మౌనిక భూమా మంచు సరికొత్త సేవా విప్లవానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవ కోసం “ఐక్య ధైర్య సేన సమితి” అనే సరికొత్త సామాజిక సేవా సంస్థను వీరు అధికారికంగా ప్రారంభించారు. కూకట్‌పల్లిలో మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరం ప్రత్యేక సభలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సంస్థ పేరును అధికారికంగా ప్రకటించారు.
ఐదుగురు పిల్లల దత్తత.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాల విస్తరణ
ఈ సందర్భంగా సభలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. “చిన్నప్పటి నుంచి సేవ చేయడం అనేది నేను, నా భార్య మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్నాం. సమాజం కోసం పని చేయాలనుకునే వారందరికీ ఒకే వేదిక ఉండాలనే ఉద్దేశంతో మౌనిక ఆలోచనల నుంచి పుట్టిందే ఈ ‘ఐక్య ధైర్య సేన సమితి’. ఈ రోజు నుంచే ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి పూర్తి చదువు బాధ్యతలను మేము స్వీకరిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడితో ఆగవు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామానికి ఈ సమితిని విస్తరిస్తాం” అని ప్రకటించారు.
Also Read
- బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Vijay Deverakonda: విజయ్ దేవరకొండతో సుకుమార్ సినిమా లేనట్టేనా? అసలు కథ ఇదేనా!
- Hanuman Ansh : 'హనుమాన్ అంశ్'చూడాలన్న తెలుగు ఆడియన్స్ కల తీరుతుందా?
- The Paradise: నాని అతిపెద్ద రిస్క్.. 'ది పారడైజ్' బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా? ట్రేడ్ లెక్కలు ఇవే!
మౌనిక భూమా మంచు మాట్లాడుతూ.. ఈ ట్రస్ట్ కేవలం రక్తదానాలకే పరిమితం కాదని స్పష్టం చేశారు. మహిళా సాధికారత, ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి పెడతామన్నారు. ‘నమస్తే వరల్డ్’ అనే సంస్థ ద్వారా మహిళలకు ‘టాయ్ మేకింగ్’ (బొమ్మల తయారీ) కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి, వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. తమ పెద్దల ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రయాణానికి అందరి మద్దతు కావాలని కోరారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. మంచు కుటుంబంతో తమకు 30 ఏళ్ల అనుబంధం ఉందని, మనోజ్ హృదయం ఎప్పుడూ సమాజం కోసమే ఆలోచిస్తుందని కొనియాడారు. ఈ ట్రస్ట్‌కు తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.
మంచు మనోజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల రిలీజ్ అయిన ‘మిరాయి’ చిత్రంలో మనోజ్ ‘మహాబీర్ లామా’ (బ్లాక్ స్వోర్డ్) పాత్రలో తన నటనా విశ్వరూపాన్ని ప్రేక్షకులకు రుచి చూపించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘డేవిడ్ రెడ్డి’. 1897 – 1920 బ్రిటిష్ కాలం నాటి నేపథ్యంలో హనుమ రెడ్డి యక్కంటి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇంటర్నేషనల్ యాక్ట్రెస్ మారియా ర్యాబోషప్కా హీరోయిన్గా నటిస్తోంది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!