NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అవుతుండటంతో అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన సమాచారం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
నందమూరి బాలకృష్ణ సినిమాలు సంక్రాంతి పండుగ సీజన్‌ను టార్గెట్ చేసుకుని వస్తుంటాయి. కానీ ఈసారి సరికొత్త వ్యూహంతో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. చిత్ర బృందం NBK111 చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. డిసెంబర్ చివరి వారంలో వరుస సెలవులు ఉండటం ఈ సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. గోపీచంద్ మలినేని మార్క్ పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్, బాలయ్య ఊరమాస్ మేనరిజమ్స్ ఈ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ ప్రకారం అక్టోబర్ కల్లా షూటింగ్ మొత్తం పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అనుకున్న సమయానికి పనులు పూర్తయితే డిసెంబర్ 24న బాలయ్య బాక్సాఫీస్ వేట మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!