TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమన్నా బాలీవుడ్లో ఆఫర్స్ పెరిగాక గ్లామర్ రోల్స్ మాత్రమే కాదు బోల్డ్ పాత్రలకు కూడా నో చెప్పడం లేదు. బ్యాడ్సాఫ్ బాలీవుడ్లో స్పెషల్ సాంగ్ కోసం విపరీతమైన స్కిన్ షో చేసిన మిల్కీ బ్యూటీ నెక్ట్స్ మరో బోల్డ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐటమ్ సాంగ్స్ ఏ హీరోయిన్ కెరీర్నైనా కిల్ చేశాయేమో కానీ తమన్నా కెరీర్‌కు మాత్రం బూస్టప్ ఇచ్చాయి. ఇంకా చెప్పాలంటే స్పెషల్ సాంగ్స్‌తో కూడా కోట్లు కూడగట్టొచ్చని, ఆఫర్స్ పట్టొచ్చని ఫ్రూవ్ చేసింది. ఎంతో మంది స్టార్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్గా మారింది. ఇంత వరకు ఓకే కానీ సౌత్‌లో హద్దులు మీరని గ్లామర్ షో చేసిన తమన్నా బాలీవుడ్ వెళ్లాక బోల్డ్ అండ్ రొమాంటిక్ సీన్స్‌లో రెచ్చిపోయి మరీ నటిస్తోంది.
టాలీవుడ్లో చేస్తోన్న సినిమాలు ఫ్లాప్ కావడంతో ఆమెను లైట్ తీసుకుంటున్నారు ఇక్కడి మేకర్స్. కానీ బాలీవుడ్లో స్కిన్ షోతో బాగానే ఆఫర్స్ కొల్లగొడుతోంది. ఇప్పటికే చేతిలో వివాన్, రేంజర్, రోహిత్ శెట్టి సినిమాతో పాటు వి శాంతారం బయోపిక్ ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి జాయిన్ అయ్యింది తమన్నా. బాలీవుడ్లో హారర్ ప్లస్ బోల్డ్ సిరీస్ థ్రిల్లర్ రాగిణి ఎంఎంఎస్ పార్ట్ త్రీలో యాక్ట్ చేస్తోంది మిల్కీ బ్యూటీ. రాగిణి3 సెట్స్‌లోకి ఎంటరైన పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది తమన్నా. ఈ మూవీని శశాంక్ ఘోష్ డైరెక్ట్ చేస్తున్నాడు. పార్ట్ వన్ అండ్ టూ కన్నా మరింత భయంకరంగా, బోల్డ్‌గా తెరకెక్కించబోతున్నారట మేకర్స్. ఇందులో సల్మాన్ రిలేటివ్ ఆయుష్ శర్మ, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, నర్గీస్ ఫక్రీ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. బాలాజీ మోషన్ పిక్చర్స్, టిప్స్ ఫిల్మ్స్, జై హో మీడియా వెంచర్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి.
Also Read
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!