Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
- సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా
- సోనమ్ వాంగ్‌చుక్‌తో సంబంధం లేదు
- రచయితలకు కూడా తెలియదన్న ఆమిర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన సూపర్‌హిట్ చిత్రం ‘3 ఇడియట్స్’ గురించి చాలా కాలంగా ఒక ప్రచారం కొనసాగుతోంది. సినిమాలోని రణ్ఛో ‘ఫున్సుఖ్ వాంగ్డు’ పాత్ర సామాజిక కార్యకర్త, విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అయితే, ఈ ప్రచారానికి తాజాగా ఆమిర్ ఖాన్ పూర్తిగా తెరదించారు.
సోనమ్ వాంగ్‌చుక్‌తో సంబంధం లేదు
గురువారం లండన్‌లో జరిగిన ‘లగాన్’ ప్రత్యేక ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమిర్ ఖాన్, ‘3 ఇడియట్స్’ సినిమా సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తితో రూపొందిందనే వార్తలను ఖండించారు. ఆయన మాట్లాడుతూ… “అది నిజం కాదు. అది పూర్తిగా ఒక అపార్థం. మేము ‘3 ఇడియట్స్’ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు సోనమ్ వాంగ్‌చుక్ గురించి అసలు తెలియదు. తర్వాత ఒక వీడియోలో ఓమీ వైద్య (చతుర్ పాత్రధారి) అలా చెప్పడం చూశాను. కానీ అది సరైన సమాచారం కాదు.” అని స్పష్టం చేశారు.
Also Read
రచయితలకు కూడా తెలియదన్న ఆమిర్
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, రచయిత అభిజాత్ జోషి పేర్లను ప్రస్తావించిన ఆమిర్ ఖాన్, సినిమా బృందంలో ఎవరికీ అప్పట్లో సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదని చెప్పారు. “రాజ్‌కుమార్ హిరానీకి, అభిజాత్ జోషికి లేదా మాలో ఎవరికీ అప్పట్లో సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదు. ఆయన చేస్తున్న పని గొప్పది. దాన్ని మెచ్చుకోవడానికి ‘3 ఇడియట్స్’లోని పాత్ర ఆధారంగా ఉండాల్సిన అవసరం లేదు. నేను కేవలం వాస్తవాలను మాత్రమే చెబుతున్నాను.” అని ఆమిర్ పేర్కొన్నారు.
సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన
ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం గురించి కూడా ఆమిర్ ఖాన్ స్పందించారు. “ఆయన ఆరోగ్యం, ప్రాణం గురించి మేమంతా ఆందోళన చెందుతున్నాం. అన్నీ బాగానే జరుగుతాయని ఆశిస్తున్నాం. ఆయన దీక్షను విరమించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం.” అని చెప్పారు.
ఓమీ వైద్య వ్యాఖ్యలతో మళ్లీ చర్చ
కొద్ది రోజుల క్రితం ‘3 ఇడియట్స్’లో చతుర్ రామలింగం పాత్ర పోషించిన నటుడు ఓమీ వైద్య ఒక వీడియో విడుదల చేశారు. అందులో సోనమ్ వాంగ్చుక్కు మద్దతు తెలుపుతూ, సినిమాలో ఆమిర్ ఖాన్ పోషించిన ఫున్సుఖ్ వాంగ్డు పాత్ర ఆయనను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారని పేర్కొన్నారు. దీంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఆమిర్ ఖాన్ స్వయంగా స్పందిస్తూ, ‘3 ఇడియట్స్’ సినిమా సోనమ్ వాంగ్‌చుక్ జీవితకథ ఆధారంగా రూపొందలేదని, అది కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!