Manjummel Boys producers directly releasing their film with Mythri distribution: ఈ మధ్యకాలంలో మలయాళ సినిమాలను నేరుగా తెలుగులో రిలీజ్ చేస్తున్న సంస్కృతి పెరుగుతోంది. ఒకప్పుడు మలయాళ సినీ పరిశ్రమ అంటే చిన్నచూపు ఉండేది కానీ కరోనా సమయంలో తెలుగు వారంతా మలయాళ సినిమాలకు అలవాటు పడ్డారు. దీంతో అక్కడ సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలను ఓటీటీలో తెలుగు డబ్బింగ్ చేయించి రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ఇక నేరుగా థియేటర్లలో కూడా రిలీజ్ చేస్తూ వస్తున్న పరిస్థితులు గమనిస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఫిబ్రవరి నెలలో మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన భ్రమ యుగం సినిమాని తెలుగులో రిలీజ్ చేశారు. ఇక్కడ అనుకున్నంత కలెక్షన్స్ రాక పోయినా మంచి పేరు అయితే వచ్చింది. ఇక ప్రేమలు సినిమాని మార్చి 8వ తేదీన తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఫిబ్రవరి 22వ తేదీన మలయాళం లో రిలీజ్ అయ్యి ఫాస్టెస్ట్ 100 క్రోర్ గ్రాసింగ్ మలయాళ మూవీగా నిలిచిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమాని కూడా తెలుగులో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమైంది.
Also Read; Rana Naidu: రానా నాయుడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
నిజానికి ఈ సినిమాని కొని డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసేందుకు తెలుగులో కొన్ని బడా బ్యానర్లు కూడా ప్రయత్నించాయి. కానీ సినిమా యూనిట్ మాత్రం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే డబ్బింగ్ హక్కులు ఎవరికి ఇవ్వకుండా తామే డబ్బింగ్ చేయించి మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన మైత్రి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మార్చి 15వ తేదీన సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఒకరకంగా ఇది తెలుగులో పెద్ద బ్యానర్లకు షాక్ అని చెప్పాలి. మలయాళ చిదంబరం డైరెక్ట్ చేసిన ఈ మూవీ 11 మంది స్నేహితుల చుట్టూ తిరిగే ఓ సర్వైవల్ థ్రిల్లర్. 2006లో తమిళనాడు కొడైకెనాల్ లో ఉన్న గుణ గుహల్లో జరిగిన ఓ నిజ జీవిత ఘటన ఆధారంగా ఈ సినిమాని తరికెక్కించారు. కేరళ కొచ్చి లోని మంజుమ్మేల్ కి చెందిన 11 మంది స్నేహితులు 2006లో తమిళనాడు కొడైకెనాల్ లో ఉన్న గుణ కేవ్స్ కు పర్యటకులుగా వెళ్లారు వెళ్లారు. అందులో ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఓ లోతైన గుంతలోకి జారిపోతాడు. అతన్ని రక్షించడానికి మిగిలిన స్నేహితులు ఏం చేశారన్నదే ఈ మంజుమ్మెల్ బాయ్స్ స్టోరీ.