విలక్షణ నటుడు సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘ఆకాశవాణి’. దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అశ్విన్ గంగరాజు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్ పై పద్మనాభ రెడ్డి ‘ఆకాశవాణి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాకు ఎడిటర్గా జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు. ప్రముఖ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు సింగర్ కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘మన కోన’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా విడుదల చేశారు మేకర్స్. విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ ను మంగ్లీ, కాల భైరవ ఆలపించగా… అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.