తన అన్న సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. అదేంటి అని ఆశ్చర్య పోకండి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేష్, చిన్నోడుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి పెద్దోడు వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దోడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసిన చిన్నోడు మహేష్ బాబు.. సోషల్ మీడియా వేదికగా పెద్దోడి సినిమా ఎలా ఉందో చెబుతూ.. ఆ సినిమాలో నటించిన వారందరికీ అభినందనలు తెలిపారు. ‘‘పండగకి వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశా, ఇది పర్ఫెక్ట్ పండుగ సినిమా. విక్టరీ వెంకటేష్ గారు చాలా అద్భుతంగా నటించారు, వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న నా దర్శకుడు అనిల్ రావిపూడిని చూసి గర్వంగానూ, సంతోషంగానూ ఉంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వారి పాత్రలలో అద్భుతంగా నటించారు.
Wamiqa Gabbi: తగ్గేదేలే.. ప్లాప్ హీరోయిన్ ఖాతాలో ఆరు సినిమాలు
బుల్లిరాజు అనే పాత్రలో బుడ్డోడు ఆద్యంతం నవ్వులు పూయించాడు. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు’’ అని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి మహేష్ బాబు రివ్యూ ఇచ్చాడు. ఇక చిన్నోడి స్పందనపై అనిల్ రావిపూడి కూడా స్పందించారు. సర్, చాలా ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ నా బలానికి మూలస్థంభం అయినందుకు మీకు చాలా ధన్యవాదాలు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మీ స్పందనతో మా మొత్తం బృందం చాలా సంతోషంగా ఉంది అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు.