Khushi kapoor: చెల్లి కూడా నందమూరి హీరోతోనే టాలీవుడ్ ఎంట్రీ?
- మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్
- హీరోయిన్ ఎంపికపై ఊహాగానాలు
- కుషీ కపూర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారనే ప్రచారాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khushi kapoor Tollywood Debut with Mokshagna – Prasanth Varma Movie: నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు నాడు నందమూరి నాలుగో తరం నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు అనే ఊహాగానాలు ఉన్నాయి. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మొదటి సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు. ఈ సినిమాను 6న పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారని, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని అంటున్నారు. నిజానికి నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖాయమైనప్పటి నుండి మీడియాలో రకరకాల ఊహాగానాలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నాడు. ఆయన సినిమా అధికారిక ప్రకటన తేదీ దగ్గర పడుతుండడంతో హీరోయిన్ ఎంపికపై ఊహాగానాలు మొదలయ్యాయి.
Also Read
దర్శకుడు ప్రశాంత్ వర్మ కథానాయికగా కుషీ కపూర్‌ని ఎంపిక చేయాలని భావించారని అంటున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే దేవర, రామ్ చరణ్ 16 అనే రెండు పెద్ద సినిమాల్లో నటిస్తుండడంతో శ్రీదేవి కూతుళ్ల క్రేజ్ ఎలాంటిదో ఈజీగా అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాలో కుషీ కపూర్‌ని హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారనే ప్రచారాలు మొదలయ్యాయి. అయితే అసలు విషయం నిజమేనా? కాదా? అని తెలుసుకునే ప్రయత్నాలు చేయగా మేకర్స్ ఇంకా కుషీ కపూర్‌ని సంప్రదించలేదని తెలిసింది. అసలు సంప్రదించ లేదు అంటే ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే చెప్పాలి. కాబట్టి ఆమె కథ విని, ఆమె తండ్రి బోనీ కపూర్ విని ఫైనల్ చేయాలి. అప్పుడు వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది. అయితే కాంబినేషన్ మాత్రం సాలిడ్ గా ఉండడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..
-
Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్..
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..