Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas Surprise: హీరోయిన్ ఇమాన్వీ పుట్టినరోజును మరింత స్పెషల్‌గా మార్చారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇమాన్వీ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ప్రత్యేకంగా ఫుడ్ పంపించడంతో ఆమె ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రభాస్ పంపించిన ఫుడ్ ట్రీట్‌కు సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఇమాన్వీ.. తన మనసు, కడుపు రెండూ నిండిపోయాయని పేర్కొంటూ ప్రభాస్‌కి కృతజ్ఞతలు తెలిపారు.
దీంతో ప్రభాస్ అభిమానులు ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తనతో కలిసి పనిచేసే వారిని ప్రత్యేకంగా చూసుకోవడంలో ప్రభాస్‌కు మంచి పేరుంది. ఇప్పుడు ఇమాన్వీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పంపించిన ఈ సర్ప్రైజ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఒక పీరియాడిక్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతోంది. ఈ సినిమాతో ఇమాన్వీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. ఇప్పటికే ప్రభాస్‌తో ఆమె కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొనగా, తాజాగా ఈ బర్త్‌డే సర్ప్రైజ్ వార్త కూడా అభిమానుల్లో చర్చకు దారితీసింది.
Also Read
తాజావార్తలు
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..