Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన అతి తక్కువ టైంలోనే మార్కెట్ను శాసించే స్థాయికి చేరింది. పండుగ రేసులో నిలిచిన ప్రతి భారీ చిత్రాన్ని తమ ఖాతాలోనే వేసుకుంటూ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ నైజాం ఏరియాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. దసరా బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలన్నీ ఒకే సంస్థ ద్వారా విడుదలవుతుండటం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వారం థియేటర్లలోకి రానున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్లన్నీ మైత్రీ బ్యానర్ నుంచే నైజాం బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ మోస్ట్ క్రేజీ సీక్వెల్ ‘జైలర్ 2’ అక్టోబర్ 15న రిలీజ్ కానుండగా, ఈ సినిమా నైజాం రైట్స్ మైత్రీ సంస్థ వద్దే ఉన్నాయి. ఇక అక్టోబర్ 16న రానున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పీరియాడిక్ డ్రామా ‘రణబాలి’, అక్టోబర్ 17న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రాల నైజాం పంపిణీ బాధ్యతలను కూడా మైత్రీ సంస్థే చేజిక్కించుకుంది. వరుసగా మూడు రోజుల్లో రాబోయే ఈ మూడు విభిన్న చిత్రాలు ఒకే డిస్ట్రిబ్యూటర్ చేతుల మీదుగా రావడం నైజాం సినిమా చరిత్రలోనే అత్యంత అరుదైన పరిణామంగా చెబుతున్నారు.
కొత్త సినిమాలే కాకుండా, ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద నడుస్తున్న ‘హనుమాన్ అంశ్’, మూడో వారంలోకి అడుగుపెట్టిన ‘ది ప్యారడైజ్’ కూడా మైత్రీ డిస్ట్రిబ్యూషన్ పరిధిలోనే ఉండటం విశేషం. దీంతో హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక సినిమా థియేటర్స్ మైత్రీ సినిమాలతోనే నిండిపోయాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్య 70ఎంఎం, సంధ్య 35ఎంఎం, సుదర్శన్ 35ఎంఎంలతో పాటు దిల్సుఖ్నగర్ మెగా, ఉప్పల్ రాజలక్ష్మి, బాలానగర్ విమల్ వంటి ప్రముఖ సింగిల్ స్క్రీన్లు అన్నీ మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తున్న సినిమాలకే కేటాయించబడ్డాయి. పోటీ ఉన్న చిత్రాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, థియేటర్లను తమ గుప్పిట్లోకి తీసుకోవడం ద్వారా నైజాం మార్కెట్లో తమకు ఎదురులేదని మైత్రీ మరోసారి నిరూపించిందనే కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా జోరుగా వినిపిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Tollywood: దసరా వార్లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
-
Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
-
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
-
AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
-
Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..