ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిడివి విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నా సరే, సినిమా మాత్రం యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.
Also Read:Saahu Gaarapati : సైలెంటుగా మలయాళ హిట్టు కొట్టిన తెలుగు నిర్మాత
అయితే ఈ సినిమాలో ధనుష్ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. నిజానికి నాగార్జున పాత్ర గురించి కూడా ప్రస్తావిస్తున్నారు, కానీ ధనుష్ నటన గురించి జరుగుతున్న చర్చ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి ధనుష్‌కి ఇప్పటికే ఈ సినిమా కంటే ముందు రెండు నేషనల్ అవార్డులు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ధనుష్ నటన చూసిన ప్రతి ఒక్కరూ, ఈ సినిమాలో నటనకు గాను మరోసారి నేషనల్ అవార్డు సాధించడం ఖాయమని అంటున్నారు.
Also Read:Samantha : వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. సమంత పోస్ట్
బిచ్చగాడిగా ధనుష్ నటన, ప్రతి సీన్‌లో కనిపిస్తున్నపుడు తీసుకున్న జాగ్రత్త, చూపించిన పర్ఫెక్షన్ ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారి తీసింది. నిజానికి ధనుష్ ఈ క్యారెక్టర్‌లో ఎంతగా లీనమయ్యాడంటే, కథలో భాగంగా వచ్చే డాన్స్‌లో కూడా తన పాత్రను పూర్తిగా అవగాహన చేసుకుని కనిపించాడు. ఒక నటుడిగా ధనుష్ ఇప్పటికీ ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించాడు, కానీ ఇది ఆయన కెరీర్ బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.