ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రెండు భాషల సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు సినిమాల గురించి. ఇప్పుడంటే పరిస్థితులు బాగాలేవు, హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బాహుబలి తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర భాషలకు కూడా వెళ్లి అక్కడ కూడా హిట్‌లయ్యాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు.
Also Read:Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ డేట్ కు వస్తాడో..?
తెలుగువారు, తమిళ ప్రేక్షకులు సైతం ఆ భాషల సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగు నిర్మాతలు సైతం మలయాళ సినిమాల మీద ఆసక్తి కనబరుస్తున్నారు. కొంతమంది అక్కడి సినిమాలను చేసి తెలుగులో డబ్బింగ్ చేస్తుంటే, మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థలు ఏకంగా అక్కడికి వెళ్లి సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చాయి.
Also Read:Sekhar Kammula: ఆ హీరోతో ఏషియన్లోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్!
ఇక ఇప్పుడు సాహు గారపాటి కూడా షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద మలయాళంలో ఒక సినిమా చేసి రిలీజ్ చేశాడు. ఈ సినిమాకి డైరెక్టర్ విపిన్ దాస్ సహ-నిర్మాతగా వ్యవహరించారు. విపిన్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ‘వ్యసన సమేతం బంధు మిత్రాదికల్’ అనే సినిమా జూన్ 13వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు, మంచి కలెక్షన్స్ కూడా తీసుకొస్తోంది. అలా మన తెలుగు నిర్మాత మలయాళంలో కూడా తొలి హిట్ కొట్టినట్లు అయింది.