స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సల్మాన్ ఖాన్ ను ఓ పట్టాన వదిలిపెట్టడం లేదు. సికిందర్ కోసం కండల వీరుడి కండలు కరిగేలా ఫైట్ సీన్స్ డిజైన్ చేశాడట. ఫ్యాన్స్ కు సల్లూ భాయ్ మాస్ జాతర చూపించేందుకు ఎయిర్ క్రాఫ్ట్, ట్రైన్, జైల్, హాస్పిటల్లో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని సమాచారం. జైలులో సల్లూభాయ్ గ్యాంగ్ స్టర్లతో తలపడే సీన్ వేరే లెవల్ అట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫ్యాన్స్ కు ఈ యాక్షన్ పీక్డ్ సీన్స్ పిచ్చెక్కిస్తాయని బీటౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సల్మాన్ ఖాన్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న సికిందర్ మార్చి 28న థియేటర్లను షేక్ చేసేందుకు వచ్చేస్తోంది. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సాజిత్ నడియా వాలా నిర్మిస్తున్నారు. సుమారు రూ. 400 కోట్లతో నిర్మిస్తున్నారని టాక్.
Also Read : Naga Chaitanya : తండేల్ సక్సెస్ మీట్ ప్లేస్ ఫిక్స్ చేసిన నాగచైతన్య
రీసెంట్లీ స్కై ఫోర్స్ తో హాయ్ చెప్పిన అక్షయ్ కుమార్ మరో హై ప్రొఫైల్ హిస్టారికల్ డ్రామాతో రాబోతున్నాడు. అక్షయ్, మాధవన్, అనన్య పాండే కీ రోల్స్ చేసిన ‘కేసరి చాప్టర్ 2’ హోలీ పండగను పురస్కరించుకుని మార్చి 14న థియేటర్లలోకి వచ్చేస్తోంది. జలియాన్ వాలా బాగ్ బాధితుల తరుఫున పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది శంకర్ నాయర్ లైఫ్ ఆధారంగా ‘కేసరి చాప్టర్ 2’ తెరకెక్కుతోంది. ‘శంకర’ నుండి పేరు మార్చడానికి రీజన్.. గతంలో అక్షయ్ నటించిన ‘కేసరి’ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు, ఈ రెండింటికి పీరియాడికల్ లింక్స్ ఉండటంతో యాప్ట్ టైటిల్ గా భావించి ‘కేసరి 2’ గా మార్చారు. అందుకే ‘కేసరి’ రిలీజ్ డే అయిన హోలీ ఫెస్టివల్ కే సీక్వెల్ మూవీని తెస్తున్నారు.