టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్‌లు ఉన్న అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి కస్తూరి ఒకరు. హీరోయిన్‌గా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో తన జత కట్టి మంచి గుర్తింపుసంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం కస్తూరి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రజంట్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్‌తో ముందుకు సాగుతుంది. అయితే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటూ, తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది కస్తూరి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం పంచుకుంది. ప్రతిరోజు రాత్రి 9 అయ్యిందంటే చాలు తనకు ఓ అలవాటు ఉందట.. ఆ అలవాటు మానుకోవడానికి ఆమె ఎంతో ప్రయత్నించినప్పటికీ తన వల్ల కావడం లేదట.
Also Read :Samantha : తనతో నా బంధానికి ఎలాంటి పేరు పెట్టలేను..
ఇంతకి ఎంటా అలవాటు అంటే రాత్రి అయ్యిందంటే చాలు.. ఆమె బయటి ఫుడ్ తింటుందట. అదేదో గంట కొట్టినట్టుగా రాత్రి 9 అయ్యిందంటే తన మనసు లాగినట్టు అనిపిస్తుందట. ఏదో ఒక జంక్ ఫుడ్ బయట నుంచి తెచ్చుకొని తింటే తప్ప తనకు నిద్ర పట్టదట. ఈ అలవాటు మానుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, తన వల్ల కావడం లేదట. తన జిమ్ ట్రైనర్ కూడా ఈ అలవాటు మానుకోమని చాలా సార్లు చెప్పినప్పటికీ తన వల్ల కావడం లేదట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.