Ameer Log : ‘అమీర్ లోగ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరం అంటే కేవలం చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు, ఇక్కడి బస్తీల్లో ఉండే మనుషులు, వారి ఆప్యాయతలు, సంస్కృతి అంతకంటే ప్రత్యేకమైనవి. ఆ నగర ఆత్మను (Soul), బస్తీల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ రూపుదిద్దుకున్న నూతన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ ఆగస్ట్ 21న సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, టాలీవుడ్ ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకువస్తోంది.
ఈ సందర్భంగా దర్శకడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ నగరంతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. “మాది నల్గొండ జిల్లా రాఘవపురం అయినప్పటికీ, 1997లోనే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాను. ఇక్కడి అనేక ప్రాంతాల్లో నివసించిన నా అనుభవంతో బస్తీలలో ఉండే సజీవమైన మనుషులను తెరపై చూపించాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశాను. ముందుగా మా చిత్రబృందానికి, ఆ తర్వాత స్పిరిట్ మీడియా టీమ్‌కు ప్రదర్శించి చూపించాం. కథలోని సహజత్వం నచ్చడంతో రానా స్పిరిట్ మీడియా వారు మాకు అండగా నిలిచారు. నిజానికి డబ్బున్న వారు అమీర్ లోగా? లేక మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండే వారు అమీర్ లోగా? అనేది ఈ సినిమా చూస్తే స్పష్టమవుతుంది. నీతి బోధలా కాకుండా ఒక అంతర్గత ఫిలాసఫీతో సాగే ఈ చిత్రం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ హైదరాబాదీల మీద మరింత ప్రేమ, గౌరవం పెరుగుతాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు ఈ వేదికపై స్మరణ్ సాయి సంగీతంలో రూపుదిద్దుకున్న ‘అవ్వల్ దావత్’ అనే మాస్ దక్కనీ సాంగ్‌ను విడుదల చేశారు. మనోజ్ కుమార్ సాహిత్యం అందించగా రాహుల్ పాడిన ఈ పాట ప్రస్తుతం సంగీతప్రియులను ఆకట్టుకుంటోంది.
Also Read
తాజావార్తలు
-
US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!