Collections : అసలు గ్రాస్, షేర్,నెట్ మధ్య తేడా ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పరిశ్రమలో నేడు ఏ కొత్త చిత్రం విడుదలైనా, మొదటిరోజున పోస్టర్లలో వందల కోట్ల అంకెలు ప్రత్యక్షమవ్వడం పరిపాటిగా మారింది. “మా సినిమా ₹100 కోట్లు సాధించింది”, “₹200 కోట్ల క్లబ్లో చేరింది” అనే ప్రకటనలు సామాన్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ, థియేటర్ వద్ద నుండి వసూలైన మొత్తం పైసలు నేరుగా నిర్మాత జేబులోకి వెళ్తాయా? అంటే ఖచ్చితంగా ‘లేదనే’ చెప్పాలి. ముఖ్యంగా కలెక్షన్స్ ను నెట్ అని షేర్ అని గ్రాస్ అని అంటుంటారు. అయితే అసలు వీటి అర్ధం ఏమిటి? వీటి మధ్య ఉన్న తేడా ఏమిటి అనేది ఇటీవల ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఒక యువ నిర్మాత వెల్లడించారు.
అసలు గ్రాస్, షేర్,నెట్ అంటే ఏంటి?
ఈ సినిమా బిజినెస్ వెనుక గ్రాస్, నెట్, షేర్ అనే మూడు కీలక గణాంకాలు ఉంటాయి. వీటి గురించిన పూర్తి అవగాహన లేకపోతే బాక్సాఫీస్ నంబర్లు తీవ్ర అయోమయానికి గురిచేస్తాయి. అసలు ఈ మూడు పదాల అర్థం ఏమిటి? థియేటర్ల నుంచి నిర్మాత వరకూ డబ్బు ఎలా ప్రయాణిస్తుంది? లెక్కింపు విధానం ఎలా ఉందో కూలంకషంగా చూద్దాం.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
1. గ్రాస్ కలెక్షన్స్
సామాన్య ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి కొనుగోలు చేసే ప్రతీ టికెట్ ధర నుండి వచ్చే మొత్తం ఆదాయాన్ని ‘గ్రాస్ కలెక్షన్’ అంటారు.
ఉదాహరణకు: ఒక సినిమా టికెట్ ధర ₹100 అనుకుంటే, ఆ రోజు ప్రదర్శితమైన అన్ని షోలలో కలిపి 10,000 మంది ప్రేక్షకులు టికెట్లు కొంటే వసూలయ్యే ₹10,000 × 100 = ₹10,00,000 (పది లక్షల రూపాయలు) గ్రాస్ అవుతుంది. పోస్టర్ల మీద, మీడియాలో ప్రచారమయ్యే 100 కోట్లు లేదా 200 కోట్ల నంబర్లు దాదాపుగా ఈ గ్రాస్ వసూళ్లే.
2. నెట్ కలెక్షన్స్
ప్రేక్షకుడు చెల్లించే టికెట్ ధరలోనే ప్రభుత్వం విధించే జీఎస్టీ దాగి ఉంటుంది. గ్రాస్ కలెక్షన్ల నుండి ఈ ప్రభుత్వ పన్నును తీసివేయగా వచ్చే నికర మొత్తాన్ని ‘నెట్ కలెక్షన్’ అంటారు.
భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, టికెట్ ధర ₹100 లేదా అంతకంటే తక్కువ ఉంటే 12% GST (ఈ మధ్య కొన్నింటిపై 5% స్లాబ్ కూడా వర్తింపజేస్తున్నారు), ₹100 కంటే ఎక్కువ ఉంటే 18% GST వర్తిస్తుంది. ఉత్తర భారతంలో (బాలీవుడ్) మరియు విదేశాలలో సినిమాల సక్సెస్‌ను ప్రధానంగా ఈ ‘నెట్’ నంబర్ల ప్రాతిపదికన మాత్రమే లెక్కిస్తారు.
3. షేర్ కలెక్షన్స్
సినిమా వ్యాపారంలో అత్యంత కీలకమైనది ‘షేర్’. నెట్ అమౌంట్ వచ్చిన తర్వాత అందులో థియేటర్ యజమాని (ఎగ్జిబిటర్), పంపిణీదారుడు (డిస్ట్రిబ్యూటర్) వాటాలు, డిజిటల్/పబ్లిసిటీ ఖర్చులు పోగా చివరిగా మిగిలే మొత్తాన్ని ‘షేర్’ అంటారు. ఈ రూపంలో మాత్రమే డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్లకు అసలు ఆదాయం దక్కుతుంది.
గ్రాస్ (Gross) = మొత్తం అమ్మకమైన టికెట్ల సంఖ్య × టికెట్ ధర
నెట్ (Net) = గ్రాస్ – ప్రభుత్వ పన్నులు (GST)
షేర్ (Share) = నెట్ – (థియేటర్ వాటా + డిస్ట్రిబ్యూషన్ కమీషన్ + డిజిటల్/పబ్లిసిటీ ఖర్చులు)
నెట్ కలెక్షన్స్ వచ్చిన తర్వాత ఎగ్జిబిటర్ (థియేటర్), డిస్ట్రిబ్యూటర్ మధ్య ఆదాయ పంపిణీ జరుగుతుంది. ఇది అన్ని థియేటర్లలో ఒకేలా ఉండదు.
మల్టీప్లెక్స్‌లు:
హైదరాబాద్‌లోని AMB మల్టీప్లెక్స్ వంటి వాటిలో సుమారు 47.5% నుంచి 52.5% వాటా ప్రొడ్యూసర్/డిస్ట్రిబ్యూటర్‌కి వెళ్తే, బ్యాలెన్స్ థియేటర్ మెయింటెనెన్స్ కింద ఉంచుకుంటారు. PVR లాంటి చోట్ల ప్రొడ్యూసర్ వాటా 55% వరకు ఉంటుంది. AAA, ART, అల్లు సినిమాస్ వంటి ప్రీమియం మల్టీప్లెక్స్‌లలో మౌలిక వసతులు, భారీ పెట్టుబడుల దృష్ట్యా థియేటర్ యాజమాన్యం కొంత అదనపు పర్సంటేజ్ (2.5%) ఉంచుకుంటుంది.
సింగిల్ స్క్రీన్స్ (Single Screens):
సాధారణంగా మొదటి వారంలో 50% – 50% ప్రాతిపదికన పంపిణీ ఉంటుంది.
రెండవ వారం నుండి ఇది 60% – 40% కి మారుతుంది.
ఉదాహరణ లెక్క: ₹100 టికెట్ కొంటే నిర్మాతకు ఎంత వస్తుంది?
ఒక సాధారణ ప్రేక్షకుడు థియేటర్లో ₹100 పెట్టి టికెట్ కొన్నాడనుకుందాం:
గ్రాస్ టికెట్ ధర: ₹100
18% GST మైనస్ చేస్తే (నెట్): ₹82
ఫస్ట్ వీక్ థియేటర్ యాజమాన్యం వాటా (50%): ₹41 ఎగ్జిబిటర్‌కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్‌కి మిగిలేది ₹41.
డిస్ట్రిబ్యూటర్ కమీషన్ (10%): సుమారు ₹4.1 మైనస్ అవుతుంది. బ్యాలెన్స్ ₹36.9.
డిజిటల్ చార్జీలు (Qube, UFO), వాల్ పోస్టర్ ఖర్చులు: మరో ₹2 తీసివేస్తే…
నిర్మాత చేతికి వచ్చే ఆఖరి షేర్: దాదాపు ₹35 మాత్రమే!
అంటే ప్రేక్షకుడు చెల్లించే ₹100 రూపాయలలో నిర్మాత చేతికి వచ్చేది కేవలం 35% నుండి 38% మాత్రమే!
పెద్ద సినిమాల బిజినెస్ విషయంలో GST విధానం మరొక మలుపు తిప్పుతుంది. డిస్ట్రిబ్యూటర్ భారీ రేట్లకు సినిమా హక్కులను కొనుగోలు చేసినప్పుడు సినిమా సూపర్ హిట్ అయి లాభాలు వస్తే: ప్లస్ GST (18%) కలుపుకుని ఇన్వాయిస్ వేస్తారు. సినిమా ఒకవేళ ఫ్లాప్ అయి నష్టాలు వస్తే ఆ కట్టిన అమౌంట్‌ను ‘ఇంక్లూడింగ్ GST’ కింద మార్చి, డిస్ట్రిబ్యూటర్‌కు GST ఇన్పుట్ క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిర్మాతలు ఈ టాక్స్ అమౌంట్‌ను జీఎస్టీ డిపార్ట్మెంట్కు వెంటనే చెల్లించలేకపోవడం వల్ల, నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు రావాల్సిన రీఫండ్లు ఆలస్యమవుతుంటాయి. పోస్టర్ల మీద కనిపించే ₹100 కోట్లు లేదా ₹200 కోట్ల సంఖ్య కేవలం గ్రాస్ మాత్రమేనని, అందులో అన్ని పన్నులు, థియేటర్ వాటాలు మరియు కమిషన్లు పోగా నిర్మాతకు దక్కే అసలు షేర్ దాదాపు మూడో వంతు మాత్రమే.
తాజావార్తలు
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్‌కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!