‘విక్రమ్’ మూవీ రిలీజ్ టైం లో కమల్‌ను చూసి తెలుగు హీరోలు చాలా నేర్చుకోవాలంటే కోలీవుడ్‌లో సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. అదే సమయంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కావడంతో.. కమల్ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తుంటే, ఆయన కూతురు తో చిరు, బాలయ్య నటిస్తున్నారని, ఆ పాట లేంటి? హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లు ఏంటి? వయసుకు తగ్గ క్యారెక్టర్ చేయాలి అంటూ తమిళ్ ఆడియన్స్, క్రిటిక్స్ నుంచి విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా విడుదలైన ‘థగ్ లైఫ్’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్.
Also Read : Habit Effects: పిల్లల్లో ఈ అలవాటు చాలా ప్రమాదకరం..!
అందరూ ‘థగ్ లైఫ్’ ట్రైలర్ చూసే ఉంటారు ఇందులో అభిరామితో కమల్ హాసన్ లిప్ లాక్ సీన్ చేశారు. ఇప్పుడు కమల్ హాసన్ వయస్సు 70 సంవత్సరాలు. అభిరామి వయస్సు 41 ఏళ్లు. త్రిష ఆమె కంటే ఏడాది పెద్ద. ఆమె వయస్సు 42. అంటే తన కంటే వయసులో 30 ఏళ్లు చిన్న అయినటువంటి హీరోయిన్లతో కమల్ ఆ రొమాంటిక్ సీన్స్ ఏంటి? లిప్ లాక్ ఏంటి? అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు. కమల్ హాసన్‌ను చూసి చిరంజీవి బాలకృష్ణ నేర్చుకోవాలని అని అన్నారు.. అయితే 70 ఏళ్ల వయసులో కమల్ హాసన్ ఏం చేస్తున్నారో చూడమని కొందరు ట్వీట్లు చేశారు. కానీ ఎటు చూసినా ఈ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం లభిస్తుంది.