Kalki 2898 AD Director Nag Ashwin Background: ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట కల్కి. ఎక్కడ విన్నా ఒకటే ప్రశ్న కల్కి టికెట్లు దొరికాయా? అని. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కల్కి సినిమా క్రేజ్ మాములుగా లేదు. నిజానికి ఈ సినిమాను డైరెక్ట్ చేసిన నాగ్ అశ్విన్ ఇప్పటి వరకుచేసింది రెండే రెండు సినిమాలు. కానీ మూడో సినిమాతో ఏకంగా ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా మహానటి సావిత్రి బయోపిక్‌ను నాగ్ అశ్విన్ హ్యాండిల్ చేసిన తీరుకు ఇండస్ట్రీ షాక్ అయింది. మధ్యలో ‘జాతి రత్నాలు’ కోసం నిర్మాతగా మారిన నాగి.. ‘పిట్ట కథలు’లోని ఓ సెగ్మెంట్‌కు దర్శకత్వం కూడా వహించాడు. ఇక ఇప్పుడు కల్కితో వస్తున్నాడు. ఒక్క సినిమాకు ఆరేళ్లు పని చేశాడంటే.. కల్కి ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అది కూడా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో సినిమా అంటే మాటలు కాదు. అందులోను బాహుబలి తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే హెయెస్ట్ బడ్జెట్‌తో సినిమా చేశాడు.
Kalki 2898 AD: తుఫాన్ కాదిది సునామీ.. రిలీజ్ కు ముందే 14 లక్షల టిక్కెట్ల అమ్మకం!
అదీను సాదా సీదా కమర్షియల్ ఫిల్మ్ కాదు. ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సాహసమే చేశారు. మైథాలజీకల్ సైన్స్ ఫిక్షన్ సినిమా చేశాడు. మహాభారతాన్ని టచ్ చేస్తూ.. ఫ్యూచర్‌ను ముందే ఓ అంచనా వేసి ఆరు వేల సంవత్సరాల కథను చెప్పబోతున్నాడు. మరి నాగ్ అశ్విన్ ఈ స్థాయికి ఎలా వచ్చాడు? అంటే, అతని జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నాగ్ అశ్విన్, హీరో రానా దగ్గుబాటి ఇద్దరు క్లాస్‌మేట్స్. స్కూల్ డేస్ నుంచే రైటింగ్ స్కిల్ ఉన్న నాగి.. ముందుగా వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకున్నాడు. కానీ ఇక్కడితో ఆగలేదు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన ‘నేను మీకు తెలుసా? సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దగ్గర లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలకు ఏడీగా చేశాడు. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి ఓ యాడ్, షార్ట్ ఫిల్మ్ కూడా చేశాడు. ఇక్కడే నాగి లైఫ్ టర్న్ అయింది. ఆ షార్ట్‌ఫిల్మ్ చూసిన ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తెలు ప్రియాంక, స్వప్న సినిమా ఛాన్స్ ఇచ్చారు.
అదే.. నానితో తెరకెక్కించిన ఎవడే సుబ్రమణ్యం సినిమా. 2015లో 10, 12 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ప్రియాంక దత్‌ను పెళ్లి చేసుకున్నాడు నాగి. ఇక ఆ తర్వాత 2018లో మహానటితో వావ్ అనిపించుకొని.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో.. హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో 600 కోట్ల బడ్జెట్‌తో కల్కి సినిమా చేశాడు. అది కూడా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి స్టార్ క్యాస్టింగ్ అంటే మాటలు కాదు. అందుకే.. కల్కి సినిమాకు హిట్ టాక్ వస్తే ఈజీగా వెయ్యి కోట్లు రాబడుతుందనే అంచనాలున్నాయి. అదే జరిగితే.. రాజమౌళి తర్వాతి ప్లేస్‌లో నాగ్ అశ్విన్ చేరడం గ్యారెంటీ. అప్పుడెప్పుడో బుజ్జి పరిచయ ఈవెంట్ కాకుండా తెలుగు నాట సింగిల్ మీడియా మీట్ లేకుండా, ప్రమోషన్ ఈవెంట్ లేకుండా సినిమాకు ఇంత భారీ బజ్ తీసుకురావడం ప్రభాస్ క్రేజ్ తో పాటు నాగ్ అశ్విన్ పనితనం మీద నమ్మకం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.