బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి బయటికి వచ్చాక మళ్లీ అక్కడికి వెళ్లకూడదు అనిపిస్తుంది, అది భూతాలకు దెయ్యాలకు ఆవాసం లాంటిది అంటూ వ్యాఖ్యలు చేసింది.
Also Read:Amzath Basha: ఏడాది పాలనలో అప్పు తప్ప.. పాలన, అభివృద్ధి లేదు!
అయితే ఆమె ఇలా మాట్లాడింది కానీ తాను దెయ్యాన్ని నేరుగా చూసినట్లు అయితే చెప్పలేదు. ఆ నెగిటివ్ ఎనర్జీ తాను ఫీల్ అయినట్లు ఆమె వెల్లడించింది. ఇక ఆమె మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాజోల్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎన్నో సినిమాలు చేసింది. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌ను పెళ్లాడిన ఆమె తర్వాత కూడా కొన్ని సినిమాలు కొనసాగింది.
Also Read:Tollywood: నిర్మాతల జట్టు ‘ఓటీటీ’ల చేతుల్లోకి?
కానీ పిల్లల కోసం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా 2024లో వచ్చిన అజయ్ దేవగన్, మాధవన్ నటించిన సైతాన్ సినిమాకి స్పిన్ ఆఫ్‌గా రూపొందించారు. అంటే ఆ సినిమాకి సంబంధించిన అంశాలతోనే ఈ సినిమాని రూపొందించారన్న మాట. ఈ అనుభవాన్ని ఆమె ఇలా మీడియాతో పంచుకున్నదన్న మాట.