K RAMP చిత్ర నిర్మాత రాజేష్ దండ కు ఓ వెబ్ సైట్ కు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. KRAMP సినిమా మంచి కలెక్షన్స్ తో సినిమా అన్ని ప్రాంతాల్లో దూసుకువెళ్తోంటే కొన్ని వెబ్సైట్స్ నిర్మాత రాజేష్ దండపై, ఆయన సినిమాపైన నెగిటీవ్ క్యాంపెన్ను ప్రారంభించారని,. సినిమా కలెక్షన్స్న ప్రభావితం చేసేలా.. ఇండస్ట్రీలో నిర్మాత రాజేష్ దండ పేరు చెడగొట్టేలా రకరకాల ట్వీట్స్ తో ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టించారని వారిని చెప్పుతో కొడతానని నిర్మాత రాజేష్ దండ సంచలన వ్యాఖ్యలు చేసారు.
దాంతో సదరు వెబ్ సైట్ నిర్వాహకులు కూడా ఈ వివాదంపై కౌన్సిల్ లో ఫిర్యాదు చేసారు. అటు రాజేష్ దండ కూడా తనపై కుట్ర చేస్తున్నారని తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు ఆరోపణల మధ్య సాగిన ఈ వ్యవహారానికి తాజాగా ఫుల్ స్టాప్ పెట్టేసారు నిర్మాత రాజేష్ దండ. తాజాగా జరిగిన KRAMpage సెలెబ్రేషన్స్ ఈవెంట్ లో రాజేష్ దండ మాట్లాడుతూ ‘ లాస్ట్ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిన మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను. వారికీ నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఆ రోజు నేను వాడిన పదజాలం ఇబ్బందిగా ఉందని నా స్నేహితులు కూడా చెప్పారు. ఆ నేను అలా మాట్లాడి ఉండకూడదు. మీడియా వారికీ నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఛాంబర్ కి ఇచ్చిన లెటర్ లో కూడా కొన్ని తప్పులు దొర్లాయి. ఇతర వెబ్ సైట్స్ గురించి నేను మాట్లాడినని కూడా వెనక్కి తీసుకుంటున్నాను, అలాగే ట్వీట్ లో ప్రస్తావించిన వ్యాఖ్యలు కూడా. ఫైనల్ చెప్పేదేంటంటే గా మంచి మంచి సినిమాలు లైనప్ చేసుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.