టాలీవుడ్ టూ కోలీవుడ్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిక. మొన్నటి వరకు ఫ్యామిలి కే పరిమితం అయిన ఈ అమ్మడు ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బాలీవుడ్ మాత్రమే బిజీ అయిపోయింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లపై దృష్టి సారిస్తోంది. ఈ మధ్య కాలంలో ‘కాదల్ ది కోర్’, ‘డబ్బా కార్టెల్’ లాంటి శక్తివంతమైన కథలతో ప్రేక్షకుల్ని మెప్పించిన జ్యోతిక ఇప్పుడు ఓ కోర్టు రూమ్ డ్రామాతో రావడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read : Avika Gor : నేను దేన్నీ అంత ఈజీగా తీసుకోను..
జ్యోతిక ప్రధాన పాత్రలో ‘బరేలీ కీ బర్ఫీ’ ఫేమ్ అశ్విని అయ్యర్ తివారీ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎక్సెల్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ నిర్మిస్తున్న ఈ లీగల్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కూడా నటించనుంది. ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షి మధ్య కోర్టులో ముఖాముఖి సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తాయట. భావోద్వేగాలతో కూడిన ఈ కోర్టు రూమ్ థ్రిల్లర్ షూటింగ్ ఇప్పటికే మొదలు పెట్టింది చిత్రబృందం. అమెజాన్ ప్రైమ్ వేదికగా రాబోతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.