రాజకీయ నాయకుల తనయులు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కామన్. అలా ఇప్పటికే చాలామంది ప్రముఖుల వారసులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేట్ టెస్ట్ చేసుకున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్.. కన్నడ ఇంస్ట్రీలో తమదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘జూనియర్’ మూవీతో హీరోగా పరిచయం అవుతున్నారు కిరీటి.
Also Read : HYD : రాంగ్ రూట్ కష్టాలు.. బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు..
2022 లో స్టార్ట్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కాగా, జెనీలియా, రవిచంద్ర కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఇక తాజాగా ఈ ‘జూనియర్’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో జూలై 18న విడుదల చేయబోతున్నట్టు గురువారం మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు కె. కె. సెంధిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తండ్రి జనార్దన్ రెడ్డి ఓ పక్క జైలు జీవితాన్ని గడుపుతుంటే… కొడుకు కిరీటి సినిమా జాతీయ స్థాయిలో విడుదల కానుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.