టాలీవుడ్ స్టార్ హీరోలు దుబాయిలో దర్శనం ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఒక బడా నిర్మాత కుమారుడి వివాహం జరిగింది. ఆ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి భార్యలతో హాజరయ్యారు. అయితే మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన భార్య నమ్రత ఈ వివాహానికి హాజరయ్యారు.
Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !!
ఇక వీరందరూ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ నిర్మాత ఎవరో తెలుసా? మహేష్ రెడ్డి. ఆయన నాగార్జునతో షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలు చేశారు. ఈ వివాహానికి నాగార్జున, చిరంజీవి, నిరంజన్ రెడ్డి, అనిరుద్ రవిచందర్, సుకుమార్ వంటి వాళ్ళు హాజరయ్యారు.