బుల్లితెర ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ వెండితెరపై కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తోంది. కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అప్పుడప్పుడు ప్రత్యేక గీతాల్లోనూ అలరిస్తోంది. ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా వుంది ఈ అమ్మడు. అయితే తాజాగా అనసూయ వ్యాక్సిన్ వేయించుకుంది. వ్యాక్సిన్ వేస్తున్న సమయంలో భర్త చేతిని గట్టిగా పట్టుకుని, కళ్లు మూసుకుని తెగ భయపడిపోయింది. మొత్తానికి వ్యాక్సిన్ పూర్తి అయిందని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా ఆమె వ్యాక్సిన్ కోసం పడిన పాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.