ఓ సారి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు, తరువాత కార్తీక్ ఆర్యన్ పేరు… ఇప్పుడు జెహాన్ హండా! సారా అలీఖాన్ ఎఫైర్ల ప్రచారం మామూలుగా ఉండదు. సైఫ్ అలీఖాన్ లాంటి సీనియర్ నటుడి కూతురు అయినా బోల్డ్ గా, ఓపెన్ గా ఉండటం సారా స్టైల్. నవాబుల కుటుంబం నుంచీ వచ్చినా బీ-టౌన్ బిజినెస్ సీక్రెట్స్ బాగా తెలుసు బ్యూటిఫుల్ బేబీకి! అందుకే, ఎప్పుడూ తన ఎఫైర్లతో మీడియాలో, సొషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ గా కొనసాగుతూ ఉంటుంది. తాజాగా ఆమె ఓ అసిస్టెంట్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని ముంబైలో ప్రచారం జరుగుతోంది…
సారా తొలి చిత్రం ‘కేదార్ నాథ్’. ఆ సినిమాకి ఏడీగా పని చేశాడు జెహాన్ హండా. అతనితో బీచ్ లో దిగిన ఫోటోలు ఈ మధ్యే సారా ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో కనిపించాయి. అంతే కాదు, మిస్ అలీఖాన్ ‘లవ్ యూ’, ‘టేక్ మీ బ్యాక్’ అంటూ రొమాంటిక్ పదాలు కూడా వాడేసింది! అంతకు ముందు అవే ఫోటోల్ని జెహాన్ హండా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో షేర్ చేశాడు. వాట్ని సారా కూడా మనసారా నెటిజన్స్ తో పంచుకుంది!
Read Also : సీరియస్ గా వర్కౌట్లు చేస్తున్న కపూర్ సిస్టర్స్… కానీ నవ్వాగట్లేదుగా…!!
జెహాన్ హండా సారా ఫోటోల్ని షేర్ చేయటం ఇదేం కొత్త కాదు. పోయిన సంవత్సరం ఓ వీడియోలో వారిద్దరి హ్యాపీ మూమెంట్స్ ని జనంతో పంచుకున్నాడు. సారా మీద తన ప్రేమని, ఇష్టాన్ని చాటుతు ఒకింత పెద్ద పోస్టునే రాశాడు. ‘నేనున్నా… నువ్వు ముందుకెళ్లు’ అంటూ భరోసా కూడా ఇచ్చాడు! మరి ఇంత దాకా వచ్చాక చెప్పేదేముంది? జెహాన్ అండ్ సారా ఆర్ కపుల్…
బాలీవుడ్ లో సారా అలీఖాన్ బాయ్ ఫ్రెండ్స్ చర్చ జరగటం ఇదే మొదటిసారి కాదు. కార్తీక్ ఆర్యన్ తో ఆమె వ్యవహారం చాలా హైలైట్ అయింది. కానీ, మంచి ముహూర్తం చూసుకుని వారిద్దరూ విడిపోయారు. అయితే, సారాగానీ, కార్తీక్ గానీ ఇంత వరకూ తాము కపుల్ అనీ, బ్రేకప్ చేసుకున్నామనీ… ఏదీ చెప్పలేదు! మరిప్పుడు కొత్త ప్రియుడు జెహాన్ గురించైనా ‘లవ్ ఆజ్ కల్’ బ్యూటీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తుందో.. లేదో… వేచి చూడాలి!