ఆయుష్మాన్ ఖురానా సూపర్ హిట్ మూవీకి సీక్వెల్

బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖుర్రానా హిట్ చిత్రానికి సీక్వెల్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 2019లో వచ్చిన కామెడీ డ్రామా “డ్రీమ్ గర్ల్” బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. నిజానికి ఇది ఆయుష్మాన్ కెరీర్‌లో అతిపెద్ద వసూళ్లు సాధించిన సినిమా. రాజ్ షాండిల్యా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నుష్రత్ భారుచా హీరోయిన్ గా నటించింది. తాజా అప్డేట్ ప్రకారం మేకర్స్ ఆ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రణాళికలో ఉన్నారు.

Read Also : కిస్ సీన్స్ అనుభవం వెల్లడించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ బేబీ

బీ-టౌన్ టాక్ ప్రకారం దర్శకుడు రాజ్ షాండిల్యా ప్రస్తుతం ఈ స్క్రిప్ట్ సీక్వెల్ కోసం పని చేస్తున్నారు. ఆయన మరో కథను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాలలో ఏది ముందుగా సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది. థియేటర్లలో, టెలివిజన్ రెండింటిలో “డ్రీమ్ గర్ల్” బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం నిర్మాతలను ఖుషి చేసింది. అందుకే సీక్వెల్ కు ‘డ్రీం గర్ల్’ నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ సీక్వెల్ గురించి మరో నెలరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-